ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Narendra Modi: బిల్ గేట్స్‌కు మోదీ సలహా

ABN, First Publish Date - 2023-02-04T17:10:11+05:30

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలహా ఇచ్చారు.

Prime Minister Narendra Modi praises Bill Gates
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌(Bill Gates) కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సలహా ఇచ్చారు. తృణధాన్యాలకు సంబంధించి మోదీ ఇచ్చిన సలహాపై జోరుగా చర్చ జరుగుతోంది.

అమెరికాకు చెందిన ప్రముఖ చెఫ్ ఎయిటాన్‌ (Eitan Bernath)తో కలిసి గేట్స్ రోటీ (Indian Roti) తయారు చేశారు. ఈ విషయాన్ని చెబుతూ ఆయన తన ఇన్‌స్టా‌గ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశారు. ఎయిటాన్‌ ఇటీవల భారత్‌లో పర్యటించి బీహార్‌ (Bihar)లోని గోధుమ రైతులను కలుసుకున్నారు. దీదీ కా రసోయ్ (Didi Ki Rasoi) కమ్యూనిటీ క్యాంటీన్‌ మహిళలను కలుసుకుని రోటీలు చేయడం నేర్చుకున్నారని గేట్స్ తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాశారు. వీడియోలో ఎయిటాన్, గేట్స్ ఇద్దరూ గోధుమ పిండి కలపడం, కాల్చడం, రుచి చూడటం చూపించారు. వీడియో వైరల్ కావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. గేట్స్ మంచి పనిచేశారని ప్రశంసించారు. భారత్‌లో తృణధాన్యాల ట్రెండ్ నడుస్తోందని, ఈసారి మిల్లెట్స్‌లో రోటీ ట్రై చేయాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి తృణధాన్యాల సంవత్సరం జరుపుకుంటోన్న వేళ ఆయన గేట్స్‌కు ఇచ్చిన సలహాకు ప్రాధాన్యత ఏర్పడింది.

Updated Date - 2023-02-04T17:13:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising