ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Private buses: వరుస సెలవుల ఎఫెక్ట్‌.. ప్రైవేటు బస్సుల్లో చార్జీల మోత

ABN, First Publish Date - 2023-08-12T09:06:47+05:30

పండుగ, వారాంతపు వరుస సెలవులు వచ్చాయంటే చాలు చెన్నైలోని ప్రైవేటు సంస్థల బస్సులన్నీ పోటీపడి మరీ చార్జీలను విపరీతంగా పెంచడం ఆనవాయితీగా

- 30 శాతం పెరిగిన టిక్కెట్‌ ధర

చెన్నై, (ఆంధ్రజ్యోతి): పండుగ, వారాంతపు వరుస సెలవులు వచ్చాయంటే చాలు చెన్నైలోని ప్రైవేటు సంస్థల బస్సులన్నీ పోటీపడి మరీ చార్జీలను విపరీతంగా పెంచడం ఆనవాయితీగా మారింది. ప్రస్తుతం రెండో శనివారం, ఆదివారం సెలవులు, మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవం సెలవు రావడంతో నగరంలో వ్యాపారం, ఉద్యోగం చేస్తున్నవారంతా సోమవారం సెలవుపెట్టి స్వస్థలాలకు వెళ్తున్నారు. ఇప్పటికే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, ప్రభుత్వ రవాణా సంస్థల బస్సుల్లో టిక్కెట్ల రిజర్వేషన్లు ముగిశాయి. శుక్రవారం సాయంత్రం ఎగ్మూరు, సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ల నుంచి దక్షిణాది జిల్లాలవైపు బయలుదేరిన అన్ని రైళ్లు ప్రయాణికులతో నిండిపోయాయి. కోయంబేడు నుంచి రోజూ నడుపుతున్న 2100 బస్సులకు అదనంగా 400 ప్రత్యేక సర్వీసులను కూడా రాష్ట్ర రవాణా సంస్థ నడుపుతోంది. మదురై, తిరుచ్చి, తిరునల్వేలి, నాగర్‌కోవిల్‌(Madurai, Trichy, Tirunelveli, Nagercoil), కోయంబత్తూరు, తెన్‌కాశి, తిరుప్పూరు, కుంభకోణం, తంజావూరు, సేలం, హోసూరు, ధర్మపురి నగరాలకు ఈ ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. ఇదే విధంగా తాంబరం, తిరువళ్లూరు, కాంచీపురం నుంచి కూడా 100 ప్రత్యేక బస్సులు దక్షిణాది నగరాలవైపు బయలుదేరాయి. ప్రస్తుతం రైళ్లు, ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులలో ప్రయాణించడానికి వీలులేనివా రంతా ప్రైవేటు బస్సుల్లో స్వస్థలాలకు బయలు దేరేందుకు సిద్ధమయ్యారు.

అదే సమయంలో వరుస సెలవులకు దక్షిణాది జిల్లాల వైపు పర్యటించేవారి సంఖ్య రోజురోజుకూ అధికమవుతుండటాన్ని గమనించిన ప్రైవేటు బస్‌ సంస్థల యజమానులు చార్జీలను 30 శాతం దాకా పెంచేశారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని ప్రైవేటు బస్సుల్లో టికెట్లు లభించక వేలాదిమంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అదే సమయంలో పెరిగిన చార్జీలను గమనించి ఆందోళన చెందారు. రద్దీ ఎక్కువ కావడంతో బస్సుల యజమానులు శుక్రవారం సాయంత్రం నుంచే చార్జీలను 30 శాతం వరకూ పెంచారు. ఏసీ బస్సుల్లో రూ.2 వేల దాకా వసూలు చేస్తున్నారు. మదురై, తిరునల్వేలి నగరాలకు స్లీపర్‌ సదుపాయంతో ప్రయాణించేందుకు రూ.3000 నుంచి రూ.4000ల వరకు చార్జీలుగా వసూలు చేస్తున్నారు. ఆడి నెలలో సాధారణంగా ప్రయాణాలు తక్కువగానే ఉంటాయి కనుక ప్రైవేటు బస్సులో చార్జీలు తగ్గించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. వరుస సెలవుల్లో స్వస్థలాలకు బయలుదేరే ప్రయాణికుల సంఖ్య విపరీతంగా అధికమవటంతో చార్జీలను చెడమడా పెంచేశారు. కోయంబత్తూరు, తిరుప్పూరు, పొల్లాచ్చి, ఈరోడ్‌ నగరాలకు వెళ్లే ఆమ్నీ బస్సులలోను చార్జీలు పెంచారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2023-08-12T09:06:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising