ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Khalistan : ఖలిస్థాన్ అనుకూల ట్విటర్ ఖాతాలపై కొరడా

ABN, First Publish Date - 2023-03-21T10:53:56+05:30

ఖలిస్థాన్‌వాది అమృత్‌పాల్ సింగ్ (Amrit Pal Singh) కోసం వేట కొనసాగుతున్న నేపథ్యంలో ఖలిస్థాన్ అనుకూలవాదుల ట్విటర్ ఖాతాలను

Pro Khalistan Twitter Accounts Blocked
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ : ఖలిస్థాన్‌వాది అమృత్‌పాల్ సింగ్ (Amrit Pal Singh) కోసం వేట కొనసాగుతున్న నేపథ్యంలో ఖలిస్థాన్ అనుకూలవాదుల ట్విటర్ ఖాతాలను భారత దేశంలో నిలిపివేశారు. కెనడాలోని న్యూ డెమొక్రాటిక్ పార్టీ (NDP) నేత జగ్మీత్ సింగ్ (Jagmeet Singh), కెనడియన్ పోయిట్ రూపీ కౌర్ (Rupi Kaur), యునైటెడ్ సిక్స్ (United Sikhs) అనే సంస్థ, కెనడాలోని యాక్టివిస్ట్ గుర్‌దీప్ సింగ్ సహోటా తదితరుల ట్విటర్ ఖాతాలను నిలిపేశారు. వీరి ట్విటర్ ఖాతాలను యాక్సెస్ చేయడానికి భారత దేశంలో ప్రయత్నిస్తే, ‘‘లీగల్ డిమాండ్ మేరకు ఈ ఖాతాలను నిలిపివేశాం’’ అనే సందేశం కనిపిస్తుంది.

జగ్మీత్ సింగ్ భారత దేశ వ్యతిరేకి అనే సంగతి అందరికీ తెలుసు. ఆయన ట్విటర్ ఖాతాను నిలిపేయడం చాలా ముఖ్యమైన పరిణామం. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, తదితర దేశాల్లోని భారతీయులపైనా, హిందువులపైనా దాడులు జరిగిన నేపథ్యంలో ఈ ఖాతాలపై ఆంక్షలు విధించారు. ఖలిస్థాన్ వేర్పాటువాద ఉద్యమానికి మద్దతిచ్చేవారు గత వారం లండన్‌లోని భారత హై కమిషన్‌ కార్యాలయంపై దాడి చేసి, విధ్వంసం సృష్టంచారు. అదేవిధంగా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్‌పై కూడా దాడి చేశారు. ఈ రెండు సంఘటనలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వీరి దుశ్చర్యలను చట్టసభల సభ్యులు, పౌర సమాజం తీవ్రంగా ఖండించింది.

ఈ సంఘటనలపై భారత ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని న్యూఢిల్లీలోని బ్రిటన్ మిషన్‌ను కోరింది. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్‌ను పిలిచి, భారత దేశ ఆందోళనను తెలియజేసింది. దాడికి పాల్పడినవారిని అరెస్ట్ చేసి, విచారించాలని కోరింది.

ఇవి కూడా చదవండి :

Supreme Court: సీల్డు కవర్లకు స్వస్తి పలుకుదాం!

2024 Lok Sabha Polls : బీజేపీని ఓడించడం అసాధ్యం, అయితే ... : ప్రశాంత్ కిశోర్

Updated Date - 2023-03-21T10:53:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising