Puducherry: పుదుచ్చేరికి రాష్ట్ర హోదా
ABN, First Publish Date - 2023-08-06T09:38:01+05:30
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి(Puducherry)కి రాష్ట్ర హోదా కావాలంటూ ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి(Chief Minister N. Rangaswamy) అసెంబ్లీ
- అసెంబ్లీ తీర్మానానికి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అంగీకారం
పుదుచ్చేరి, (ఆంధ్రజ్యోతి): కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి(Puducherry)కి రాష్ట్ర హోదా కావాలంటూ ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి(Chief Minister N. Rangaswamy) అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్(Lt. Governor Dr. Tamilisai Soundararajan) ఆమోదించారు. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు పంపించారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించాలన్న డిమాండ్ సుదీర్ఘ కాలంగా రేగుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై 13సార్లు అసెంబ్లీలో తీర్మానాలు నెరవేర్చాక, గవర్నర్ ఆమోదించినా కేంద్రప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. ప్రతిసారీ రాష్ట్ర హోదా కోరుతూ పుదుచ్చేరిలో పలు రాజకీయ పార్టీలు, వ్యాపారులు రకరకాల ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రంగస్వామి.. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా లేనందున తనకు ఎలాంటి అధికారాలు లేకుండాపోయాయని ఏకరువు పెట్టారు. ఈ నేపథ్యంలో గత మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అఖిలపక్షం అనుమతితో ముఖ్యమంత్రి రంగస్వామి రాష్ట్ర హోదా కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టగా, సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ తీర్మానాన్ని తాజాగా పరిశీలించిన గవర్నర్ తమిళిసై.. ఎట్టకేలకు ఆమోద ముద్ర వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానానికి సంబంధించిన ఫైలు జూలై 22వ తేదీ తన దృష్టికి వచ్చిందని, దానిని క్షుణ్ణంగా పరిశీలించాక ఆమోదించి కేంద్రం అనుమతి కోసం పంపించానని వివరించారు.
Updated Date - 2023-08-06T09:38:01+05:30 IST