Martyrs Widows Insulted: అమరవీరుల భార్యలకు అవమానం... కారుణ్య మరణాలు కోరుతూ గవర్నర్‌కు మెమొరాండం
ABN, First Publish Date - 2023-03-05T12:21:18+05:30
పుల్వామా దాడి (Pulwama Attack)లో ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్ (CRPF) అమర జవాన్ల భార్యలకు అవమానం ఎదురైంది. తమకు న్యాయం చేయాలని కోరుతూ
జైపూర్: పుల్వామా దాడి (Pulwama Attack)లో ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్ (CRPF) అమర జవాన్ల భార్యలకు అవమానం ఎదురైంది. తమకు న్యాయం చేయాలని కోరుతూ జైపూర్ (Jaipur) లోని సాహిద్ స్మారకం వద్ద ధర్మాకు దిగిన ముగ్గురు సీఎఆర్‌పీఎఫ్ అమర జవాన్ల భార్యల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. రాజస్థాన్‌లోని అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) ప్రభుత్వం ఇంతగా తమను అవమానించడం భరించలేకపోతున్నామని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం తమకు న్యాయం చేస్తామని మాటిచ్చి నిలబెట్టుకోలేదని వాపోయారు. కారణ్య మరణాలకు అనుతించాలని కోరుతూ బాధితులు గవర్నర్‌కు మెమొరాండం సమర్పించారు.
గెహ్లాట్ ప్రభుత్వ ఉదాసీనతపై అమరజవాను భార్య కంటతడి...
రాష్ట్ర ప్రభుత్వం తమ గోడును పట్టించుకోకపోవడమే కాకుండా పోలీసు బలగాలతో తమను చెదరగొట్టారని పుల్వామా అమరవీరుడు రోహితేష్ లంబా భార్య మంజు లంబా (23) వాపోయింది. సీఎంకు తమ బాధలు చెప్పుకునేందుకు వెళ్లే ప్రయత్నం చేసినా తమను ప్టటించుకోలేదని, ఆ మాత్రం సమయం కూడా ఆయనకు లేదా అని మంజు లంబా ప్రశ్నించారు. పోలీసు అధికారులు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా తమ పట్ల కరకుగా వ్యవహరించారని ఆమె వాపోయింది. ''మేము ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. మా పట్ల ఇంత అమర్యాదగా ప్రవర్తించడం ఇది మొదటిసారి కూడా కాదు'' అని ఆమె అన్నారు. తప పట్ల దురుసుగా ప్రవర్తించిన రాజస్థాన్ పోలీసులపై ముఖ్యమంత్రి చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాజస్థాన్ పోలీసు అధికారులు పుల్వామా అమరవీరుల భార్యలను ఈడ్చుకువెళ్తున్న ఫోటులు కూడా వెలుగు చూశాయి. మరోవైపు, అమరవీరుల భార్యలకు న్యాయం చేయాలని కోరుతూ బీజేపీ ఎంపీ కిరోడి లాల్ మీనా జైపూర్‌లో నిరసన చేపట్టారు.
గవర్నర్‌కు మెమొరాండం..
రాజస్థాన్ ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవడం లేదంటూ పుల్వామా అమరవీరుల భార్యలు ముగ్గురూ రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాను కలుసుకున్నారు. తమను కారుణ్య మరణాలకు అనుమతించాలని కోరుతూ ఒక విజ్ఞాపన పత్రాన్ని ఆయనకు అందజేశారు.
Updated Date - 2023-03-05T12:32:03+05:30 IST