ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Punjab: ఆనంద్‌పూర్ సాహిబ్‌ వద్ద హింస.. కెనడా యువకుడి మృతి, వాహనాలకు నిప్పు

ABN, First Publish Date - 2023-03-08T14:15:28+05:30

పంజాబ్‌లోని కీరత్‌పూర్ సాహిబ్ సమీపంలో ఉన్న శ్రీ ఆనందర్‌పూర్ సాహిబ్ ప్ర వేశద్వారం వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చండీగఢ్: పంజాబ్‌లోని కీరత్‌పూర్ సాహిబ్ (Kiratpur Sahib) సమీపంలో ఉన్న శ్రీ ఆనందర్‌పూర్ సాహిబ్ (Anandpur Sahib) ప్రవేశద్వారం వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగి, అది హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణలో కెనడా (Canada)కు చెందిన 24 ఏళ్ల యువకుడు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన పంజాబ్‌లోని రాష్ట్ర భద్రతల పరిస్థితిపై మరోసారి సందేహాలకు తావిచ్చింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో మృతుని ప్రదీప్ సింగ్ అలియాస్ ప్రిన్స్‌గా పోలీసులు గుర్తించారు. మతపరమైన దుస్తులు ధరించిన ప్రిన్స్‌పై పదునైన ఆయుధాలతో తొలుత దాడి జరిగిందని, తీవ్రంగా గాయపడిన అతన్ని రోపర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశాడని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులు సమీప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు.

ఆనంద్ పూర్ సాహిబ్ వెళ్తూ దారిలో కొద్దిసేపు ఆగిన కొంతమంది వ్యక్తులకు, ఎంట్రన్స్ గేటు వద్ద ఉన్న దుకాణాల యజమానులకు మధ్య ఈ ఘర్షణ చోటుచేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఆనంద్‌పూర్ సాహిబ్‌లో జరిగే మొహల్లా పండుగలో పాలుపంచుకునేందుకు 4 కార్లలో కొందరు వచ్చారని, మార్గమధ్యంలో సైలా ఖుర్ద్ వద్ద ఆగినప్పుడు రెండు వర్గాల మధ్య వాదన చేటుచేసుకుందని, అది హింసాత్మకంగా మారిందని డీసీపీ దల్జిత్ సింగ్ తెలిపారు. పదునైన కత్తులతో వారు దాడులకు దిగారని, ఈ ఘర్షణల్లో ఒక వాహనం మంటల్లో చిక్కుకోగా వెంటనే దానిని అదుపు చేసినట్టు చెప్పారు. వాహనం మంటల్లో చిక్కుకోవడానికి కారణం ఏమిటనేది ఇంకా తెలియలేదని అన్నారు. నాలుగు వాహనాలను సీజ్ చేసి, ఘర్షణకు దిగిన రెండు వర్గాలపై మహిల్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు.

బాధాకరం: మంజిందర్ సింగ్ సిర్సా

ఆనంద్‌పూర్‌ సాహిబ్‌ వద్ద హోలా ముహల్లా వేడుకల్లో కెనడా యువకుడు మృతి చెందడం బాధాకరమని, ఇలాంటి ఘటనలపై సిక్కు వర్గాలు ఆత్మశోధన చేసుకోవాలని బీజేపీ నేత, ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు సిక్కులు, పంజాబ్‌‌ ప్రతిష్టను మసకబారుస్తాయని అన్నారు.

Updated Date - 2023-03-08T14:15:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising