ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Punjab: గ్యాంగస్టర్లపై పంజాబ్ పోలీసుల కొరడా.. ఎన్‌కౌంటర్‌లో మరో ముగ్గురి అరెస్టు

ABN, Publish Date - Dec 17 , 2023 | 02:26 PM

గ్యాంగ్‌స్టర్లపై పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్ తరహాలో వరుస ఘటనల్లో గ్యాంగ్‌స్టర్లను అదుపులో తీసుకుంటున్నారు. ఆదివారం ఉదయం మోగా జిల్లాలో గ్యాంగ్‌స్టర్లపై విరుచుకుపడిన లక్కీ పటియల్ ముఠాకు చెందిన ముగ్గురిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు.

పంజాబ్: గ్యాంగ్‌స్టర్లపై పంజాబ్ (Punjab) పోలీసుల వేట కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్ తరహాలో వరుస ఘటనల్లో గ్యాంగ్‌స్టర్ల(Gangsters)ను అదుపులో తీసుకుంటున్నారు. ఆదివారం ఉదయం మోగా జిల్లాలో గ్యాంగ్‌స్టర్లపై విరుచుకుపడిన లక్కీ పటియల్ ముఠాకు చెందిన ముగ్గురిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠా సభ్యులకు, పోలీసులకు మధ్య కాల్పులు అనంతరం వీరిని అదుపులోనికి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.


ఘటన వివరాల ప్రకారం, మోగా జిల్లాలో పంజాబ్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి బైక్‌పై వచ్చిన గ్యాంగస్టర్లను నిలువరించారు. వెంటనే అప్రమత్తమైన గ్యాంగ్‌స్టర్లు బైక్‌ను వెనక్కి తిప్పి పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని ఛేజ్ చేశారు. దీంతో బైక్‌ను రోడ్డుపక్కనే వదిలేసి పక్కనే ఉన్న పొలాల్లోకి ముఠా సభ్యులు పారిపోవడంతో పోలీసు టీమ్ కాల్పులు జరిపింది. దీంతో ప్రతికాల్పులకు ముఠా సభ్యులు దిగుతూనే చివరికి చేతులెత్తేశారు. ముఠా సభ్యులలో ఒకరు గాయపడ్డాడని, అయితే కాల్పుల వల్ల కాదని మోగా లాల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హరీందర్ సింగ్ తెలిపారు. అరెస్టు చేసిన ముఠా సభ్యుల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాల స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.


కాగా, పోలీసులపై దాడి జరిగితే కఠినంగా తిప్పికొడతామని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ హెచ్చరించిన నేపథ్యంలో గత 11 రోజుల్లో జరిగిన ఎనిమిదో ఎన్‌కౌంటర్ ఇది. మొహాలీ, పాటియాలాలో శనివారంనాడు రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇద్దరు కార్ల దొంగలు, ఒక హత్యకేసు నిందితుడు పట్టుబడ్డారు. ఈ రెండు ఘటనల్లో పట్టుబడిన ముగ్గురూ కాల్పుల్లో గాయపడినట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - Dec 17 , 2023 | 02:26 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising