ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Punjab Couple: రూ.8 కోట్లు దోచుకోని దేవుడికి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్లారు.. కానీ రూ.10 కూల్‌డ్రింక్ కొంపముంచింది..!

ABN, First Publish Date - 2023-06-19T14:18:15+05:30

ఎనిమిది కోట్ల రూపాయలు దోచుకోని ఉచితంగా పంచుతున్న రూ.10 కూల్‌డ్రింక్ కోసం ఆశపడి పోలీసులకు దొరికిపోయారు ఓ దొంగ దంపతులు. ఈ ఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం పంజాబ్‌లోని లూథియానలో గల సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ అనే సంస్థలో ఈ నెల 10న మన్‌దీప్ కౌర్ ఆమె భర్త జస్వీందర్ సింగ్ కలిసి సెక్యూరిటీ గార్డులపై దాడి చేసి రూ.8 కోట్లను దోచుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంజాబ్: ఎనిమిది కోట్ల రూపాయలు దోచుకోని ఉచితంగా పంచుతున్న రూ.10 కూల్‌డ్రింక్ కోసం ఆశపడి పోలీసులకు దొరికిపోయారు ఓ దొంగ దంపతులు. ఈ ఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం పంజాబ్‌లోని లూథియానలో గల సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ అనే సంస్థలో ఈ నెల 10న మన్‌దీప్ కౌర్ ఆమె భర్త జస్వీందర్ సింగ్ కలిసి సెక్యూరిటీ గార్డులపై దాడి చేసి రూ.8 కోట్లను దోచుకున్నారు. దోపిడీ తర్వాత మన్‌దీప్ కౌర్, జస్విందర్ సింగ్ సిక్కుల పుణ్యక్షేత్రమైన హేమ్‌కుండ్ సాహిబ్‌కు తీర్థయాత్రకు వెళ్లారు. తమ మిషన్ విజయవంతమైనందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్లినట్లు లూథియానా పోలీస్ కమిషన్ మన్‌దీప్ సింగ్ సిద్ధూ చెప్పారు. దేవుడిని దర్శించుకున్న అనంతరం నేపాల్‌కు పారిపోవాలని భార్యభర్తలిద్దరు నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

అయితే దోపిడీకి సహకరించిన మన్‌దీప్ కౌర్ సహచరుడు గౌరవ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసుకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టారు. అలాగే దొంగతనంతో సంబంధంతో ఉన్న 12 మందిలో 9 మందిని అరెస్ట్ చేశారు. అయితే మన్‌దీప్ కౌర్, జస్వీందర్ సింగ్ జంట హరిద్వార్, కేదార్‌నాథ్, హేమ్‌కుండ్ సాహెబ్ క్షేత్రాలను దర్శించుకోనున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. తీర్థయాత్రలకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. దీంతో అంతమందిలో మన్‌దీప్, జస్వీందర్‌ను గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారింది.

దీంతో పోలీసులు వారిని గుర్తించడానికి ఒక ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రణాళికలో భాగంగా యాత్రికులకు ఉచితంగా డ్రింక్ పంపిణీ చేశారు. పోలీసులు ఊహించినట్లుగా ఉచిత డ్రింక్‌ను తీసుకోవడానికి మన్‌దీప్, జస్వీందర్ ఆ స్టాల్ వద్దకు వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు వారు ముఖాలు కనిపించకుండా వస్త్రం అడ్డు పెట్టుకున్నారు. కానీ డ్రింక్ తాగేందుకు ముఖంపై ఉన్న వస్త్రాలను తొలగించారు. దీంతో వెంటనే వారిని పోలీసులు గుర్తించారు. కానీ ఏమి తెలియనట్లుగా నటించారు. హేమ్‌కుండ్ సాహెబ్ ప్రార్థనలు అయిపోయి బయటకి వచ్చాక వెంటపడి పట్టుకున్నారు. వారిద్దరి నుంచి మొత్తం రూ.21 లక్షలు, ఓ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌కు పోలీసులు ‘లెట్స్ క్యాచ్ క్వీన్ బీ’(రాణీ తేనేటీగను పట్టుకుందాం) అని పేరు పెట్టారు.

గతంలో బీమా ఏజెంట్‌గా పనిచేసిన మన్‌దీప్ కౌర్ భారీగా అప్పులు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జస్వీందర్ సింగ్‌ను వివాహం చేసుకున్న మన్‌దీప్ కౌర్.. సంపన్నురాలిగా మారాలనే ఉద్దేశ్యంతో భర్తతో కలిసి ఈ దొపిడీకి పాల్పడింది. ఈ జంట దోచుకున్న 8 కోట్లలో పోలీసులు ఇప్పటివరకు రూ.6 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తొమ్మిది నిందితులను అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. అలాగే దొంగతనం జరిగిన 100 గంటలలోపే దోషులను అరెస్ట్ చేశామని పంజాబ్ పోలీస్ చీఫ్ గౌరవ్ యాదవ్ తెలిపారు.

Updated Date - 2023-06-19T14:27:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising