ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gas leak : లూథియానాలో గ్యాస్ లీక్.. నలుగురి మృతి..

ABN, First Publish Date - 2023-04-30T10:20:20+05:30

పంజాబ్‌లోని లూథియానాలో ఆదివారం ఉదయం ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఫ్యాక్టరీలో

Goyal Milk Plant
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లూథియానా : పంజాబ్‌లోని లూథియానాలో ఆదివారం ఉదయం ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఫ్యాక్టరీలో అనేక మంది చిక్కుకున్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. భటిండా నుంచి జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) సిబ్బంది సమాచారం అందుకున్న వెంటనే బయల్దేరారు.

స్థానిక మీడియా వెల్లడించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, పంజాబ్‌లోని, లూథియానా, షేర్‌పూర్ చౌక్ సమీపంలో సువా రోడ్డులో గోయల్ మిల్క్ ప్లాంట్ ఉంది. ఇక్కడ డెయిరీ ఉత్పత్తులు తయారవుతాయి. ఆదివారం ఉదయం 7.15 గంటలకు కూలింగ్ సిస్టమ్ నుంచి గ్యాస్ లీక్ అవుతున్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఫ్యాక్టరీకి సమీపంలోని ఇళ్లలో నివసిస్తున్నవారు ఈ గ్యాస్‌ను పీల్చడంతో స్పృహ కోల్పోయారు. ఈ ప్రాంతంలోకి ఇతరులు రాకూడదని అధికారులు తెలిపారు. ఈ ఫ్యాక్టరీకి 300 మీటర్ల పరిధిలో ఈ గ్యాస్ ప్రభావం ఉందని తెలిపారు. ఈ గ్యాస్‌ను పీల్చినవారికి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుందన్నారు. పోలీసులు, అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రప్పిస్తున్నారు. బాధితులకు సహాయపడేందుకు ప్రైవేటు సంస్థల అంబులెన్సులు కూడా చేరుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి :

Elections: దేశ చరిత్రలో తొలిసారిగా ఇంటి వద్దకే వెళ్లి..

Narendra Modi మోదీకి జై, భారత్‏మాతాకీ జై అంటూ...

Updated Date - 2023-04-30T10:38:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising