ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shankaracharya Swami : ‘ప్రవక్త మహమ్మద్, జీసస్ క్రీస్తు పూర్వీకులు సనాతన హిందువులు’

ABN, First Publish Date - 2023-02-02T15:48:51+05:30

ఒడిశాలోని పురి (Puri) శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి (Swami Nischalananda Saraswati) మంగళవారం సంచలన

Swamy Nishchalanand Saraswati
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనేశ్వర్ : ఒడిశాలోని పురి (Puri) శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి (Swami Nischalananda Saraswati) మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రవక్త మహమ్మద్ (Prophet Muhammad), జీసస్ క్రీస్తు (Jesus Christ) పూర్వీకులు సనాతన హిందువు (Sanatani Hindus)లేనని చెప్పారు. అమెరికా పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారన్నారు.

స్వామి నిశ్చలానంద సరస్వతి మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ, ‘‘అమెరికన్ పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు ఈ విషయాన్ని లేవనెత్తారు. మహమ్మద్, క్రీస్తు పూర్వీకులు సనాతన హిందువులేనని రుజువైంది’’ అని చెప్పారు. మన దేశంలో దేవాలయాలు, మఠాలపై ప్రభుత్వ నియంత్రణ ఉండకూడదని చెప్పారు. ప్రతి మారుమూల గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం నిధులను ఖర్చు చేయాలని అన్నారు.

పురిలోని రత్న భండార్ తాళాలు కనిపించకపోవడం గురించి ప్రశ్నించినపుడు స్వామి మాట్లాడుతూ, దేవాలయానికి సంబంధించిన ఏ విషయంలోనూ తనను ఒడిశా ప్రభుత్వం కానీ, జగన్నాథ దేవాలయం యంత్రాంగం కానీ సంప్రదించలేదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తాను ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవాలని ప్రశ్నించారు.

జగన్నాథ దేవాలయంలో ఏడు ఖజానాలు ఉన్నాయి. వీటిలో ఒకటి ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది. నాలుగు ఖజానాల తాళాలు 38 సంవత్సరాల క్రితం కనిపించకుడా పోయాయి. జిల్లా కలెక్టర్ వద్ద రెండు తాళాలు ఉన్నాయి.

Updated Date - 2023-02-02T15:48:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising