Rajya sabha: రాజ్యసభలో ఆప్ ఫ్లోర్‌లీడర్‌గా రాఘవ్ చద్దా
ABN, Publish Date - Dec 16 , 2023 | 06:35 PM
రాఘవ్ చద్దాను రాజ్యసభలో పార్టీ నేతగా (ఫ్లోర్ లీడర్) ఆమ్ ఆద్మీ పార్టీ నియమించింది. సంజయ్ సింగ్ స్థానంలో రాఘవ్ చద్దాను నియమిస్తున్నట్టు ఆప్ నాయకత్వం రాజ్యసభ చైర్మన్‌కు ఒక లేఖలో తెలియజేసింది. లిక్కర్ పాలసీ కేసులో ప్రస్తుతం సంజయ్ కింగ్ జైలులో ఉన్నారు.
న్యూఢిల్లీ: రాఘవ్ చద్దా (Raghav Chadha)ను రాజ్యసభ (Rajya Sabha)లో పార్టీ నేతగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నియమించింది. సంజయ్ సింగ్ స్థానంలో రాఘవ్ చద్దాను నియమిస్తున్నట్టు ఆప్ నాయకత్వం రాజ్యసభ చైర్మన్‌కు ఒక లేఖలో తెలియజేసింది. లిక్కర్ పాలసీ కేసులో ప్రస్తుతం సంజయ్ కింగ్ జైలులో ఉన్నారు. సంజయ్ సింగ్ ''ఆరోగ్య కారణాల'' రీత్యా అయన ఆబ్సెన్స్‌లో ఇక నుంచి పెద్దలసభలో పార్టీ నేతగా రాఘవ్ చద్దా ఉంటారని ఆ లేఖలో ఆప్ నాయకత్వం పేర్కొంది.
కాగా, ఆప్ ఫ్లోర్ లీడర్‌గా రాఘవ్ చద్దా నియామకానికి సంబంధించిన లేఖ తమకు అందినట్టు రాజ్యసభ సెక్రటేరియట్ ధ్రువీకరించింది. రాజ్యసభ యువ పార్లమెంటేరియన్లలో చద్దా ఒకరు. ప్రివిలిజ్ కమిటీని తప్పుదారి పట్టించారనే కారణంగా చద్దాను కొద్దికాలం క్రితం రాజ్యసభ సస్పెండ్ చేసింది. అయితే గత డిసెంబర్ 4న ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ప్రవేశపెట్టిన తీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదం పొందడంతో ఈ వివాదం ముగిసింది. కాగా, ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్ కేసు కింద ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను ఈడీ అరెస్టు చేయడంతో ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. డిసెంబర్ 21 వరకూ ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు.
Updated Date - Dec 16 , 2023 | 06:35 PM