ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mimicry Row: 150 మంది మా ఎంపీలను విసిరేశారు..దానిపై చర్చ లేదు.. రాహుల్ రియాక్షన్

ABN, Publish Date - Dec 20 , 2023 | 04:35 PM

ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖ‌డ్‌ను అనుకరిస్తూ టీఎంసీ నేత చేసిన మిమిక్రీని వీడియో తీయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు. సభ నుంచి 150 మంది ఎంపీలను గొంటేశారని, దానిపై మాత్రం ఎలాంటి చర్చా లేదని అన్నారు. కనీసం ఒక చిన్న వార్తయినా మీరు చూపించండి అంటూ మీడియాను రాహుల్ నిలదీశారు.

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖ‌డ్‌ను అనుకరిస్తూ టీఎంసీ నేత చేసిన మిమిక్రీని వీడియో తీయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) తొలిసారి స్పందించారు. సభ నుంచి 150 మంది ఎంపీలను గొంటేశారని, దానిపై మాత్రం ఎలాంటి చర్చా లేదని అన్నారు. కనీసం ఒక చిన్న వార్తయినా మీరు చూపించండి అంటూ మీడియాను రాహుల్ నిలదీశారు.


''ఎంపీలు అక్కడ కూర్చున్నారు. దానిని నేను వీడియో తీశాను. నా ఫోనులో నేను వీడియో తీశాను. మీడియా దానిని చూపిస్తోంది. 150 మంది మా ఎంపీలను బయటకు (సభ నుంచి) విసిరేశారు. దానిపై మీడియాలో చర్చే లేదు. అదానీపై చర్చ లేదు, రాఫెల్‌పై చర్చ లేదు, నిరుద్యోగితపై చర్చలేదు. మా ఎంపీలు మనస్తాపంతో పార్లమెంటు బయట కూర్చున్నారు. కానీ దీనిపై ఏదైనా వార్త ఉందేమో చూపించండి. ఇది మీ బాధ్యత. కానీ మీరు కేవలం మిమిక్రీ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు'' అని మీడియాను రాహుల్ ఎదురు ప్రశ్నించారు.

Updated Date - Dec 20 , 2023 | 04:35 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising