ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rahul Gandhi: అదానీ షెల్ కంపెనీల్లో డబ్బెవరిది?.. బీజేపీకి రాహుల్ సూటిప్రశ్న

ABN, First Publish Date - 2023-04-04T14:01:47+05:30

న్యాయవ్యవస్థపై కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తెస్తోందంటూ బీజేపీ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థపై కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తెస్తోందంటూ బీజేపీ (BJP) చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తోసిపుచ్చారు. గౌతమ్ అదానీ అదానీ (Gautam Adani) అంశంపై కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. గౌతమ్ అదానీ షెల్ కంపెనీల్లో రూ.20,000 కోట్లు పెట్టుబడి పెట్టిందెవరు? ఆ డబ్బెవరిది? అని ఆయన ప్రశ్నించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తదుపరి జాబితాను నిర్ణయించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనేందుకు ఏఐసీసీ కార్యాలయానికి రాహుల్ వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ చేసిన ఆరోపణలపై మీడియా ఆయనను ప్రశ్నించగా, పదేపదే మీరు బీజేపీ ఇలా చెప్పింది, అలా చెప్పిందని అడుగుతుంటారు. చాలా చిన్న విషయం నేను బీజేపీని అడుగుతున్నాను. అదానీ షెల్ కంపెనీల్లో రూ.20,000 కోట్లు పెట్టుబడి పెట్టిందెవరు? బినామీలు ఎవరు?..అని రాహుల్ ఎదురు ప్రశ్నించారు.

పరువునష్టం కేసులో దోషిగా నిర్దారిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును సూరత్ సెషన్స్ కోర్టులో సవాలు చేసేందుకు రాహుల్ వెళ్లడం, ఆయన వెనుక పలువురు అగ్రనేతలు కూడా ఉండటంతో బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. న్యాయవ్యవస్థపై ఒత్తడి తెచ్చేందుకే ఇంత హంగామా చేస్తున్నారంటూ ఆరోపించింది.

అభ్యర్థుల జాబితా ఖరారుకు సమావేశం

కాగా, కర్ణాటక ఎన్నికల్లో అభ్యర్థుల మలి జాబితాను ఖారారు చేసేందుకు సోమవారంనాడు ఏఐసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్‌తో పాటు డీకే శివకుమార్, వీరప్ప మొయిలీ, రణ్‌దీప్ సూర్జేవాలా, డీకే సురేష్, ప్రియాంక్ ఖర్గే, మొహిషినా కిద్వాయ్ తదితరులు పాల్గొన్నారు. మే 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగనుండగా, మే 13న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2023-04-04T14:01:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising