ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rahul Gandhi: నోరు జారిన రాహుల్ గాంధీ.. ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని స్టేట్‌మెంట్

ABN, First Publish Date - 2023-10-09T23:02:31+05:30

కొన్ని కొన్నిసార్లు రాజకీయ నేతలు అనుకోకుండా నోరు జారుతుంటారు. ముఖ్యంగా మీడియా సమావేశాల్లో విలేకరులు రకరకాల ప్రశ్నలు సంధించినప్పుడు.. నేతలు తడబడుతుంటారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం అప్పుడప్పుడు..

కొన్ని కొన్నిసార్లు రాజకీయ నేతలు అనుకోకుండా నోరు జారుతుంటారు. ముఖ్యంగా మీడియా సమావేశాల్లో విలేకరులు రకరకాల ప్రశ్నలు సంధించినప్పుడు.. నేతలు తడబడుతుంటారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం అప్పుడప్పుడు ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్పేస్తుంటారు. దీంతో.. అదేదో మహాపాపం చేసినట్లుగా బీజేపీ ఎత్తి చూపుతుంటుంది. తాజాగా మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది. విలేకరులు తనని కన్ఫ్యూజ్ చేయడంతో రాహుల్ తడబడితే.. బీజేపీ దాన్ని హైలైట్ చేస్తూ పెద్ద రాద్ధాంతమే సృష్టిస్తోంది. అసలు ఏమైందంటే..

అక్టోబర్ 9వ తేదీన ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ని ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాత రాహుల్ గాంధీ మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా.. కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలపై మీ అభిప్రాయం ఏంటని విలేకరులు ప్రశ్నించారు. అందుకు రాహుల్ సమాధానమిస్తూ.. ‘‘మధ్యప్రదేశ్‌లో ఉన్న బీజేపీ ప్రభుత్వం పోతుంది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లతో పాటు తెలంగాణలోని ప్రస్తుత ప్రభుత్వాలు కూడా గద్దె దిగుతాయి’’ అని పొరపాటున అనేశారు. నిజానికి.. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గందరగోళంలో ఆయన ఆ రాష్ట్రాల్లోని తమ కాంగ్రెస్ ఈసారి ఓడిపోతుందని అన్నారు. అయితే.. వెంటనే తన తప్పుని గ్రహించి, మీరు (విలేకర్లు) గందరగోళపరచడం వల్ల తాను తప్పుగా మాట్లాడానని స్పష్టం చేశారు.


అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మా ప్రభుత్వం ఉంది. మళ్లీ ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించి, ప్రభుత్వాల్ని ఏర్పాటు చేస్తుంది. అటు మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోతుంది. తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. నిజం చెప్పాలంటే.. ఈసారి మా కాంగ్రెస్ పార్టీకే వాతావరణం సానుకూలంగా ఉంది’’ అని చెప్పారు. అయితే.. బీజేపీ మాత్రం రాహుల్ నోరు జారిన వ్యాఖ్యల్ని పట్టుకొని, రాజస్థాన్ & ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో తమ కాంగ్రెస్ ప్రభుత్వాలు దిగిపోతాయని రాహుల్ అంగీకరించారంటూ ట్విటర్‌లో వీడియోతో సహా పోస్ట్ చేసింది. కొందరు బీజేపీ నేతలు కూడా ఈ వీడియో క్లిప్‌ని షేర్ చేశారు.

ఇదిలావుండగా.. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం అసెంబ్లీలకు నవంబర్ 7 నుంచి 30 మధ్య ఎన్నికలు జరగనున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న, రాజస్థాన్‌లో నవంబర్ 23న, తెలంగాణలో నవంబర్ 30న, మిజోరాంలో నవంబర్ 7న ఎన్నికలు జరుగుతాయి. అయితే.. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం నవంబర్ 7 (20 సీట్లు), 17(70 సీట్లు)వ తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది.

Updated Date - 2023-10-09T23:02:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising