Rahul Gandhi: రాహుల్ గాంధీ అమెరికా పర్యటన
ABN, First Publish Date - 2023-05-16T14:24:13+05:30
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మే 31న అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. పది రోజుల పాటు అక్కడే ఉంటారు. జూన్ 4న న్యూయార్క్‌లోని మేడిసన్ స్వ్కేర్ గార్డెన్‌లో జరిగే ర్యాలీలో సుమారు 5,000 మంది ఎన్ఆర్ఐలు పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. దీనితో పాటు వాషింగ్టన్, కాలిఫోర్నియాలో జరిగే ప్యానలె డిస్కషన్‌లో పాల్గొంటారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో ప్రసంగిస్తారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మే 31న అమెరికా (United states) పర్యటనకు వెళ్తున్నారు. పది రోజుల పాటు అక్కడే ఉంటారు. జూన్ 4న న్యూయార్క్‌లోని మేడిసన్ స్వ్కేర్ గార్డెన్‌లో జరిగే ర్యాలీలో సుమారు 5,000 మంది ఎన్ఆర్ఐలు పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. దీనితో పాటు వాషింగ్టన్, కాలిఫోర్నియాలో జరిగే ప్యానలె డిస్కషన్‌లో పాల్గొంటారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో ప్రసంగిస్తారు. రాహుల్ తన అమెరికా పర్యటనలో పలువురు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలను కలుసుకుంటారు.
రాహుల్ గత మార్చిలో కేంబ్రిడ్జి యూనివర్శిటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందని, తనతో సహా పలువురు రాజకీయ నేతలపై నిఘా ఉంటోందని చేసిన వ్యాఖ్యలు స్వదేశంలో సంచలనమయ్యాయి. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని రాహుల్ విదేశాల్లో కించపరచేలా మాట్లాడరని, విదేశీ శక్తుల జోక్యాన్ని కోరారని బీజేపీ తప్పుపట్టింది. రాహుల్ క్షమాపణ చెప్పాలనే డిమాండ్లు కూడా వచ్చాయి. అయితే, తాను విదేశాల జోక్యాన్ని కోరాననడం పూర్తి అబద్ధమని, వాస్తవాలను వక్రీకరించారని రాహుల్ తప్పుపట్టారు. ప్రజాస్వామ్యాన్ని తాను కించపరచలేదని, బీజేపీ నేతలే అనేక సార్లు విదేశీ పర్యటనల్లో భారతదేశం దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోవడం లేదంటూ దేశ ప్రతిష్టను దిగజార్చే వ్యాఖ్యలు చేశారని అన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో దుమారం రేగగా, అదానీ గ్రూప్ కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై జేపీసీ వెయ్యాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీంతో రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో ప్రతిష్ఠంభన కొనసాగింది.
22న మోదీ అధికారిక పర్యటన
కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ 22న అమెరికాలో అధికారిక పర్యటన జరపనున్నారు. ఈ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫస్ట్ లేడీ జిల్ బైడిన్‌లు వైట్‌హౌస్‌లో ఇచ్చే విందు కార్యక్రమంలో కూడా మోదీ పాల్గొంటారు.ం
Updated Date - 2023-05-16T14:28:10+05:30 IST