Covid-19: అశోక్ గెహ్లాట్‌కు కోవిడ్ పాజిటివ్
ABN, First Publish Date - 2023-04-04T16:58:11+05:30
దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయనే ఆందోళనల నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాజాగా కోవిడ్ బారిన ..
జైపూర్: దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయనే ఆందోళనల నేపథ్యంలో రాజస్థాన్ (Rajasthan) ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) తాజాగా కోవిడ్ (Covid-19) బారిన పడ్డారు. మంగళవారంనాడు తనకు జరిగిన పరీక్షల్లో కోవిడ్ పాటిజివ్‌గా నిర్ధారణ అయినట్టు గెహ్లాట్ ఒక ట్వీట్లో తెలిపారు. వ్యాధికి సంబంధించిన స్వల్ప లక్షణాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత హోం క్వారంటైన్లోనో ఉన్నానని తెలిపారు. వైద్యుల సలహా ప్రకారం కొద్ది రోజుల పాటు ఇంటి నుంచే విధులు నిర్వహిస్తానని చెప్పారు. ప్రజలు సైతం కోవిడ్-19 ప్రోటోకాల్‌ను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరోవైపు, మంగళవారంనాడు కొత్తగా 3,308 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. యాక్టివ్ కేసులు 21.279కి పెరిగాయని చెప్పింది. కొత్తగా 9 మరణాలతో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 5,30,901కి చేరినట్టు తెలిపింది. ఢిల్లీ, పంజాబ్‌లో రెండేసి మరణాలు, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లో ఒక్కొక్క మరణం చొప్పున గత 24 గంటల్లో సంభవించినట్టు పేర్కొంది. కేసుల పెరుగుదల నేపథ్యంలో మహారాష్ట్రలోని సతారా జిల్లా యంత్రాంగం మాస్క్‌లు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, కాలేజీలు, బ్యాంకుల్లో మాస్క్‌లు తప్పనిసరి చేసింది.
Updated Date - 2023-04-04T17:10:40+05:30 IST