ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Poll Date change: ఆ రాష్ట్ర ఎన్నికల తేదీ మారింది... కారణం ఏమిటంటే..?

ABN, First Publish Date - 2023-10-11T17:45:04+05:30

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల తేదీ మారింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 23న జరగాల్సిన ఎన్నికలు తేదీని సవరించినట్టు భారత ఎన్నికల కమిషన్ బుధవారంనాడు ప్రకటించింది. నవంబర్ 25న ఎన్నికలను నిర్వహించనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది.

జైపూర్: రాజస్థాన్ (Rajasthan) అసెంబ్లీ ఎన్నికల తేదీ మారింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 23న జరగాల్సిన ఎన్నికలు తేదీని సవరించినట్టు భారత ఎన్నికల కమిషన్ (ECI) బుధవారంనాడు ప్రకటించింది. నవంబర్ 25న ఎన్నికలను నిర్వహించనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ వర్గాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్ రివైజ్ చేసినట్టు తెలిపింది. నవంబర్ 23న పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరగనున్నందున ఎన్నికల తేదీని సవరించినట్టు ట్వీట్ చేసింది.


''వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల నుంచి విజ్ఞప్తులు అందాయి. వివిధ మీడియా సంస్థలు లేవనెత్తిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. పోలింగ్ తేదీన పెద్దఎత్తున పెళ్లిళ్లు, సామాజిక కార్యక్రమాలు ఉన్నందున ఓటర్లు పార్టిషిషన్ తగ్గే అవకాశం ఉండటంతో ఎన్నికల తేదీని సవరించాలని నిర్ణయించాం'' అని ఎన్నికల కమిషన్ ఆ ప్రకటనలో తెలిపింది.


కొత్త షెడ్యూల్ ఇదే...

రాజస్థా్న్ ఎన్నికలకు సంబంధించి ఈసీఐ సవరించిన షెడ్యూల్ ప్రకారం, అక్టోబర్ 30న గెజిట్ నోటిఫికేషన్ వెలువడుతుంది. నవంబర్ 6వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. నవంబర్ 7వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 9వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. నవంబర్ 25న పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు.


23న 48,000 పెళ్లిళ్లు

తొలుత ఈసీ ప్రకటించిన నవంబర్ 23వ తేదీన కార్తీక శుద్ధ ఏకాదశి (దేవుత్తని ఏకాదశి) కావడం, విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు జరుపుకునే రోజు కావడం, అదేరోజు 45,000కు పైగా పెళ్లిళ్లు రాష్ట్రంలో జరుగనుండటంతో పోలింగ్ శాతంపై వీటి ప్రభావం పడుతుందని బీజేపీ సహా పలు రాజకీయ పార్టీలు ఈసీ దృష్టికి తీసుకువెళ్లాయి. తేదీని సవరించాల్సిందిగా విజ్ఞప్తులు చేశాయి. కాగా, ఎన్నికల కోసం మధ్యప్రదేశ్‌ వ్యాప్తంగా 51,756 పోలింగ్ బూత్‌లను ఈసీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 5.27 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వీరిలో 2.75 మంది పురుషులు, 2.51 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 18-19 ఏళ్ల మధ్య ఉన్న 22 లక్షల మంది తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Updated Date - 2023-10-11T17:45:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising