Three New districts: కొత్తగా 3 జిల్లాలను ప్రకటించిన సీఎం
ABN, First Publish Date - 2023-10-06T18:16:01+05:30
అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాలను (Three new districts) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కొత్త మాల్‌పుర, సుజన్‌గఢ్, కుచమాన్ సిటీ జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
జైపూర్: అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాజస్థాన్ (Rajasthan) సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాలను (Three new districts) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కొత్తగా మాల్‌పుర, సుజాన్‌గఢ్, కుచామన్ సిటీ జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ జిల్లాలతో కలిసి రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 53కు చేరింది.
''ప్రజల డిమాండ్, అత్యున్నత స్థాయి కమిటీ సిఫారసుల మేరకు రాజస్థాన్‌లో మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా, అత్యున్నత స్థాయి కమిటీ సిఫారసులకు అనుగుణంగా జిల్లాల పునర్విభజన కొనసాగుతుంది'' అని అశోక్ గెహ్లాట్ ఒక ట్వీట్‌లో తెలిపారు.
ఆగస్టులో 19 కొత్త జిల్లాలు
ఈ ఏడాది ఆగస్టులో కూడా రాజస్థా్న్ మంత్రివర్గం 19 కొత్త జిల్లాలు, మూడు కొత్త డివిజన్ల ఏర్పాటుు ఆమోదం తెలిపింది. జైపూర్ జిల్లాను జైపూర్, జైపూర్ రూరల్, జోధ్‌పూర్ జిల్లాను జోధ్‌పూర్, జోధ్‌పూర్ రూరల్‌గా విభజించింది. తక్కిన జిల్లాల్లో అపూన్‌గఢ్, బలోట్రా, బీవార్, డీగ్, డిడ్వానా-కూచమాన్, డుడు, గంగాపూర్ సిటీ, కెక్రి, కోట్‌పుత్లి-బెహ్రార్, ఖైర్తాల్-టిజర, నీమ్ కా థాన, ఫలోడి, స్లంబర్, సాంచోర్, షాపుర ఉన్నాయి. రాష్ట్రంలో మరింత సమర్ధవంతమైన పాలన అందించడమే లక్ష్యంగా కొత్త జిల్లాలు, డివిజన్లు ఏర్పాటు జరుగుతోందని అశోక్ గెహ్లాట్ తెలిపారు. అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు శాంతిభధ్రతలను పటిష్టం చేస్తు్న్నామని అన్నారు. కాగా, 200 మంది సభ్యుల రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారంలో ఈ ఏడాది నవంబర్ లోపు జరగాల్సి ఉన్నాయి. 2024 జనవరి 14వ తేదీతో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుంది. గత అసెంబ్లీ ఎన్నికలు 2018 డిసెంబర్‌లో జరిగాయి.
Updated Date - 2023-10-06T18:31:35+05:30 IST