కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Flesh-eating bacteria : ఒంట్లో మాంసాన్ని తినేసే బాక్టీరియా.. ముగ్గురి మృతి..

ABN, First Publish Date - 2023-08-17T10:02:55+05:30

ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ ఉంటే చాలా ఆందోళనగా ఉంటుంది. కానీ తగిన జాగ్రత్తలతో వ్యవహరిస్తే, జీవితంలో ముందుకు నడవగలుగుతాం. కోవిడ్-19 మహమ్మారి నుంచి ప్రపంచమంతా అలాగే బయటపడింది. ఇప్పుడు మనిషి ఒంట్లోని మాంసాన్ని తినేసే బాక్టీరియా కనిపిస్తోంది.

Flesh-eating bacteria : ఒంట్లో మాంసాన్ని తినేసే బాక్టీరియా.. ముగ్గురి మృతి..

న్యూఢిల్లీ : ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ ఉంటే చాలా ఆందోళనగా ఉంటుంది. కానీ తగిన జాగ్రత్తలతో వ్యవహరిస్తే, జీవితంలో ముందుకు నడవగలుగుతాం. కోవిడ్-19 మహమ్మారి నుంచి ప్రపంచమంతా అలాగే బయటపడింది. ఇప్పుడు మనిషి ఒంట్లోని మాంసాన్ని తినేసే బాక్టీరియా కనిపిస్తోంది. అమెరికాలోని న్యూయార్క్, కనెక్టికట్‌లలో ఈ వ్యాధితో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఉప్పునీటిలో, సముద్ర సంబంధిత ఆహారంలో ఈ బాక్టీరియా ఉంటుందని వైద్యులు తెలిపారు.

నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, కలరా వ్యాధికి కారణమయ్యే బాక్టీరియా కుటుంబానికి చెందిన విబ్రియో వల్నిఫికస్ సముద్ర సంబంధిత ఆహారంలో ఉంటుంది. ఈ బాక్టీరియా నులివెచ్చని, ఉప్పు నీటిలో ఉంటుంది. అమెరికాలో సముద్ర సంబంధిత ఆహారం వల్ల సంభవించే మరణాలకు అత్యధికంగా ఇదే కారణం. ఈ బాక్టీరియా కారణంగా మరణించేవారిలో 95 శాతం మంది మరణానికి కారణం సముద్ర సంబంధిత ఆహారం జీర్ణం కాకపోవడమే.

కనెక్టికట్ నగరం ప్రజారోగ్య శాఖ కమ్యూనికేషన్స్ విభాగం డైరెక్టర్ క్రిస్టోఫర్ బోయ్లే మాట్లాడుతూ, లాంగ్ ఐలండ్ సౌండ్‌లో వేర్వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులు ఈతకొట్టారని, ఈ వైరస్ సోకడంతో ఆ ఇద్దరూ మరణించారని తెలిపారు. మూడో వ్యక్తికి జూలైలో ఈ వైరస్ సోకినట్లు తెలిపారు. ఔట్-ఆఫ్-ది-స్టేట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో రా ఆయిస్టర్స్‌ను తిన్న తర్వాత ఆయనకు ఈ వైరస్ సోకిందన్నారు. ఈ ముగ్గురి వయసు 60 నుంచి 80 సంవత్సరాల మధ్యలో ఉంటుందన్నారు.


లాంగ్ ఐలండ్ గవర్నర్ కేథీ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో, ఇటీవలి సంఘటనలతోపాటు, లాంగ్ ఐలండ్‌లో మరణించిన వ్యక్తిలో కూడా ఈ వైరస్‌ను గుర్తించినట్లు తెలిపారు.

ఈ బాక్టీరియా న్యూయార్క్ జలాల్లో చేరిందా? మరొక చోట ఉందా? అనే అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. కనెక్టికట్ నగరం ప్రజారోగ్య శాఖ కమిషనర్ డాక్టర్ మనీషా జుఠానీ జూలై 28న జారీ చేసిన ప్రకటనలో, రా ఆయిస్టర్స్‌ను తినడం వల్ల, ఉప్పునీటిలో ఈతకొట్టడం వల్ల జరిగే నష్టాన్ని తెలుసుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు.

న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచుల్ కూడా ఇదే విధంగా బుధవారం ఓ ప్రకటన చేశారు. ప్రజలు తమతోపాటు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. విబ్రియో బాక్టీరియా చాలా అరుదైనదని, దురదృష్టవశాత్తూ అది న్యూయార్క్ ప్రాంతానికి వచ్చిందని తెలిపారు. గాయాలైనపుడు సముద్ర జలాలకు దూరంగా ఉండాలని తెలిపారు. రా లేదా అండర్‌కుక్డ్ షెల్ ఫిష్ వంటకాలకు దూరంగా ఉండాలన్నారు.

అసలు ఏమిటి ఈ బాక్టీరియా?

విబ్రియో వల్నిఫికస్ అనే బాక్టీరియా కారణంగా చర్మానికి గాయాలవుతాయి, చర్మం పగిలిపోతుంది, అల్సర్లు అవుతాయి. ఈ బాక్టీరియా సోకినవారికి చలి జ్వరం, అతిసార, కడుపు నొప్పి, వాంతి వచ్చే అవకాశం ఉంది. ఈ బాక్టీరియా సోకినపుడు సాధ్యమైనంత త్వరగా చికిత్స పొందాలని వైద్యులు సలహా ఇచ్చారు. గాయాలు ఉన్నవారు బ్యాండేజ్ వేసుకోవాలని సూచించారు. ఇది అత్యంత అరుదైన బాక్టీరియా అని, ఇది మనిషి ఒంట్లో ఉన్న మాంసాన్ని తినేస్తుందని తెలిపారు.


ఇవి కూడా చదవండి :

Supreme Court: మహిళలపై అనుచిత పదాలకు చెల్లు

Ilayaraja: రామేశ్వరం ఆలయంలో ఇళయరాజా పూజలు

Updated Date - 2023-08-17T10:02:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising