ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rice Exports : బియ్యం ఎగుమతులపై ఆంక్షలు తొలగించండి

ABN, First Publish Date - 2023-07-27T01:30:25+05:30

బాస్మతీయేతర బియ్యం(Rice) ఎగుమతులపై భారత ప్రభుత్వం(Government of India) ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

లేదంటే ప్రపంచ ఆహార వ్యవస్థపై పెను ప్రభావం: ఐఎంఎఫ్‌

న్యూఢిల్లీ, జూలై 26: బాస్మతీయేతర బియ్యం(Rice) ఎగుమతులపై భారత ప్రభుత్వం(Government of India) ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దేశీయంగా ధరలు పెరగకుండా ఉండేలా ఈ చర్యలు తీసుకుంది. అయి తే ఈ ఆంక్షలు తొలగించేలా చూడాలని భారత్‌ను అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్‌) విజ్ఞప్తి చేసిం ది. ఆ దిశగా భారత ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తామని తెలిపింది. భారత్‌ విధించిన ఆంక్షల కారణంగా ప్రపంచ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా 25శాతం బియ్యం ఎగుమతులు నిలిచిపోతాయని, ఫలితంగా ప్రపం చవ్యాప్తంగా ఆహార ధరలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈనెల 20న కేంద్రం బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించింది. బాస్మతి కాని ముడిబియ్యం, బాస్మతి బియ్యం ఎగుమతులు యథావిధిగా సాగుతాయని తెలిపింది. దీనిపై తాజాగా స్పందించిన ఐఎంఎఫ్‌.. ఇలాంటి ఆంక్షలతోప్రపంచ ఆహార వ్యవస్థ ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించింది. భారత్‌ నుంచి అమెరికా, థాయ్‌లాండ్‌, ఇటలీ, స్పెయిన్‌, శ్రీలంక తదితర దేశాలకు బియ్యం ఎగుమతి అవుతున్నాయని, ఇప్పుడు ఆయా దేశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది. భారత్‌ సహా కొన్ని దేశాలు స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆహార పదార్థాలపై ఆంక్షలు విధించాయని, అయితే, ప్రపంచ వ్యాప్త ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలన్న లక్ష్యానికి ఈ నిర్ణయాలు విఘాతం కలిగిస్తాయని పేర్కొంది.

Updated Date - 2023-07-27T01:30:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising