ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BBC Chairman : బీబీసీ చైర్మన్ రిచర్డ్ షార్ప్ రాజీనామా

ABN, First Publish Date - 2023-04-28T20:33:07+05:30

బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) చైర్మన్ పదవికి రిచర్డ్ షార్ప్ (Richard Sharp) శుక్రవారం రాజీనామా చేశారు. బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి

BBC
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్ : బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) చైర్మన్ పదవికి రిచర్డ్ షార్ప్ (Richard Sharp) శుక్రవారం రాజీనామా చేశారు. బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ (Boris Johnson)కు సుమారు 1 బిలియన్ డాలర్ల రుణం ఇప్పించడంలో తన పాత్రను ఆయన రహస్యంగా ఉంచినట్లు స్వతంత్ర దర్యాప్తులో బయటపడిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

బీబీసీ డైరెక్టర్‌గా రిచర్డ్ షార్ప్ నియమితులవడానికి ముందే ఈ రుణాన్ని బోరిస్ జాన్సన్ తీసుకున్నారు. అయితే ఈ రుణాన్ని ఇప్పించడంలో తన పాత్రను షార్ప్ గోప్యంగా ఉంచారు. ఆసక్తుల సంఘర్షణకు అవకాశం లేదని, ఈ రుణ ఏర్పాటులో తన ప్రమేయం లేదని గతంలో ఆయన చెప్పారు. షార్ప్‌ను బోరిస్ జాన్సన్ 2021 ఫిబ్రవరిలో బీబీసీ చైర్మన్‌గా నియమించారు. షార్ప్ అంతకుముందు ఓ బ్యాంకర్. ఆయన బ్యాంకర్‌గా ఉన్న సమయంలో జాన్సన్‌కు రుణం లభించింది. ఈ లావాదేవీకి మధ్యవర్తిగా వ్యవహరించారని స్వతంత్ర దర్యాప్తులో వెల్లడైన నేపథ్యంలో రాజీనామా చేయాలని షార్ప్‌పై ఒత్తిడి వచ్చింది.

ప్రభుత్వ నియామకాల తీరును పరిశీలించే కమిటీ నివేదిక ప్రకారం, ఆసక్తుల సంఘర్షణ సంభవించే అవకాశాన్ని వెల్లడించడంలో విఫలమవడం ద్వారా పబ్లిక్ అపాయింట్‌మెంట్స్ కోసం విధించిన ప్రభుత్వ నియమావళిని షార్ప్ ఉల్లంఘించినప్పటికీ, ఈ ఉల్లంఘన తన నియామకాన్ని చెల్లబాటుకాకుండా చేసేది కాదు.

ఈ ఉల్లంఘన ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదని, ముఖ్యమైనది కాదని రిచర్డ్ షార్ప్ చెప్పారు. చైర్మన్ పదవిలో మరొకరిని నియమించే వరకు, అంటే, జూన్ నెలాఖరు వరకు బీబీసీ చైర్మన్ పదవిలో కొనసాగాలని కోరడంతో తాను అందుకు అంగీకరించానని చెప్పారు. నియమావళి ఉల్లంఘన తన నియామకాన్ని చెల్లుబాటుకాకుండా చేసేటంత తీవ్రమైనది కాదని దర్యాప్తు నివేదిక వెల్లడించినప్పటికీ, తాను నాలుగేళ్ల పదవీ కాలం పూర్తయ్యే వరకు చైర్మన్‌గా కొనసాగితే, బీబీసీ ‘గుడ్ వర్క్’పై తన ఏకాగ్రత నిలవదన్నారు. బీబీసీ ప్రయోజనాలకే పెద్ద పీట వేయాలని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు. అందుకే తాను శుక్రవారం ఉదయం బీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశానన్నారు.

ఇవి కూడా చదవండి :

Supreme Court : విద్వేష ప్రసంగాలపై తక్షణం కేసులు నమోదు చేయాలి.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం..

Sri Ram Navami : శ్రీరామ నవమి హింసాకాండలో మమత పాత్రపై దర్యాప్తు జరగాలి : వీహెచ్‌పీ

Updated Date - 2023-04-28T20:33:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising