ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

New Parliament : నూతన పార్లమెంటు భవనాన్ని శవపేటికతో పోల్చిన ఆర్జేడీ

ABN, First Publish Date - 2023-05-28T12:32:05+05:30

నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సనాతన ధర్మ సంప్రదాయాలు, ఆచారాలు, పూజలు,

RJD tweet
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) సనాతన ధర్మ సంప్రదాయాలు, ఆచారాలు, పూజలు, హోమాలు, సర్వమత ప్రార్థనల నడుమ ఆదివారం ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమం పట్ల ప్రతిపక్షాలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తుండటం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్ (RJD) ఈ నూతన భవనాన్ని శవపేటికతో పోల్చడం వివాదాస్పదమవుతోంది.

ఆర్జేడీ ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో ఓ శవపేటిక, నూతన పార్లమెంటు భవనం చిత్రాలను పక్కపక్కనే పెట్టి, ‘ఇదేమిటి?’ అని ప్రశ్నించింది. దీనిపై ఆర్జేడీ నేత శక్తి సింగ్ యాదవ్ మాట్లాడుతూ, తమ పార్టీ ఇచ్చిన ట్వీట్‌లో శవపేటిక ఉందని, ప్రజాస్వామ్యం సమాధి అవుతోందని చెప్పడమే దీని వెనుక ఉద్దేశమని చెప్పారు. ప్రజాస్వామ్యం భూస్థాపితం కావడాన్ని దేశం అంగీకరించదన్నారు. పార్లమెంటు అంటే ప్రజాస్వామ్య దేవాలయమన్నారు. ఇది చర్చలు జరగవలసిన ప్రదేశమని చెప్పారు.

దేశ ద్రోహం కేసు.. బీజేపీ డిమాండ్..

ఆర్జేడీ ఇచ్చిన ట్వీట్‌పై బీజేపీ ఘాటుగా స్పందించింది. నూతన పార్లమెంటు భవనాన్ని శవపేటికతో పోల్చినవారిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. బిహార్ బీజేపీ నేత సుశీల్ మోదీ మాట్లాడుతూ, నూతన పార్లమెంటు భవనాన్ని శవపేటికతో పోల్చినవారిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలన్నారు.

బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా స్పందిస్తూ, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని (ఆర్జేడీని) ఈ శవపేటికలో పెట్టి సమాధి చేస్తారన్నారు. నేడు చరిత్రాత్మక దినమని, దేశమంతా గౌరవభావంతో నిండిపోయిందని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

New Parliament : సాధికారతను సంరక్షించే చోటు.. నూతన పార్లమెంటు భవనంపై మోదీ వ్యాఖ్య..

New Parliament : బాలీవుడ్ సెలబ్రిటీల ట్వీట్లను రీట్వీట్ చేసిన మోదీ

Updated Date - 2023-05-28T12:32:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising