RPF SI: ఈ ఎస్సై మామూలోడు కాదు.. ఏం చేశాడో తెలిస్తే మీరు కూడా..
ABN, First Publish Date - 2023-04-04T12:13:27+05:30
తాంబరంలో ఒక మహిళను హేళన చేసిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్ఐను ఆర్పీఎఫ్ పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
అడయార్(చెన్నై): తాంబరంలో ఒక మహిళను హేళన చేసిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్ఐను ఆర్పీఎఫ్ పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆదివారం రాత్రి తాంబరం రైల్వేస్టేషన్ సబ్వేలో నడిచి వెళుతున్న ఒక మహిళను ఎస్ఐ శ్రీనివాస నాయర్(SI Srinivasa Nair) హేళన చేస్తూ మాట్లాడాడు. దీంతో ఆ మహిళ ఎస్ఐతో వాగ్వాదానికి దిగింది. ఆ సమయంలో ఎస్ఐ మద్యం తాగి ఉన్నట్టు తేలడంతో రైల్వే పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు శ్రీనివాసన్ను అదుపులోకి తీసుకుని తాంబరం రైల్వే స్టేషన్లో విచారించగా, హేళన చేసింది నిజమని తేలడంతో వెంటనే సస్పెండ్ చేశారు.
ఇదికూడా చదవండి: తెలంగాణలో మరో టెన్త్ పేపర్ లీక్?
Updated Date - 2023-04-04T12:30:22+05:30 IST