ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

RSS : మన దేశాన్ని ‘భారత్’ అని పిలవాలి : మోహన్ భగవత్

ABN, First Publish Date - 2023-09-02T10:41:58+05:30

మన దేశం హిందూ దేశమని, దీనిని ఇండియా అని కాకుండా భారత్ అని పిలవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ (RSS chief Mohan Bhagwat) అన్నారు. మన దేశంలో ఉన్నవారందరినీ తెలియజేసే పదమే హిందూ అని చెప్పారు.

Mohan Bhagawat, RSS Chief

న్యూఢిల్లీ : మన దేశం హిందూ దేశమని, దీనిని ఇండియా అని కాకుండా భారత్ అని పిలవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ (RSS chief Mohan Bhagwat) అన్నారు. మన దేశంలో ఉన్నవారందరినీ తెలియజేసే పదమే హిందూ అని చెప్పారు. భారతీయులంతా హిందువులేనని వివరించారు. ఆయన శుక్రవారం నాగపూర్, గౌహతిలలో జరిగిన కార్యక్రమాల్లో మాట్లాడారు.

మోహన్ భగవత్ నాగపూర్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, హిందుస్థాన్ అనేది హిందూ దేశమని చెప్పారు. సిద్ధాంతపరంగా భారతీయులంతా హిందువులేనన్నారు. హిందువులంటే భారతీయులని చెప్పారు. నేడు భారత దేశంలో ఉన్నవారంతా హిందూ సంస్కృతికి, హిందూ పూర్వీకులకు, హిందూ భూమికి చెందినవారేనన్నారు. ఈ విషయాన్ని కొందరు అర్థం చేసుకున్నప్పటికీ, అమలు చేయడం లేదని, దీనికి కారణం వారి అలవాట్లు, స్వార్థపరత్వమేనని చెప్పారు. ఆరెస్సెస్ భావజాలానికి ప్రత్యామ్నాయం లేదని, అందువల్ల దానిని ప్రపంచవ్యాప్తంగా కోరుకుంటున్నారని తెలిపారు. అందరూ దీనిని గుర్తించారని, అయితే ‘కొందరు ధ్రువీకరిస్తారు, మరికొందరు ఆ పని చేయరు’ అన్నారు. స్వదేశీ కుటుంబ విలువలు, క్రమశిక్షణపై సమష్టిగా దృష్టి సారించవలసిన అవసరం ఉందన్నారు.

సకల్ జైన్ సమాజ్ గువాహటిలో నిర్వహించిన కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ, మన దేశాన్ని భారత్ అని ప్రాచీన కాలం నుంచి పిలుస్తున్నారని, అందువల్ల ఇండియాకు బదులుగా భారత్ అని పిలవాలని చెప్పారు.

‘‘ప్రాచీన కాలం నుంచి మన దేశం పేరు భారత్. ఏ భాష అయినప్పటికీ పేరు ఇదే’’నని చెప్పారు. అన్ని రంగాల్లోనూ ఇండియా అనే పదానికి బదులుగా భారత్ అనే పదాన్ని ఉపయోగించాలన్నారు. భారత్ అనే పదాన్ని ఉపయోగించినపుడు మాత్రమే మార్పు వస్తుందన్నారు. మనం మన దేశాన్ని భారత్ అని పిలవాలని, ఇతరులకు కూడా దీని గురించి వివరించి చెప్పాలని అన్నారు.

భారత దేశంవైపు ప్రపంచం చూస్తోందన్నారు. భారత్ లేనిదే ప్రపంచం మనుగడ సాగించలేదన్నారు. యోగా ద్వారా ప్రపంచాన్ని అనుసంధానం చేశామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువల గురించి చెప్పాలన్నారు.


ఇవి కూడా చదవండి :

Supreme Court : తల్లిదండుల పెళ్లి చెల్లకపోయినా పిల్లలకు వారసత్వ హక్కు ఉంటుంది : సుప్రీంకోర్టు

Chandrayaan-3: చంద్రునిపై కనుగొన్న మూలకాల ప్రాముఖ్యత ఏంటి? ఇస్రో శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు?

Updated Date - 2023-09-02T10:41:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising