ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sacrilege In Gurudwara: గురుద్వారాలో అపవిత్రం.. సీరియస్‌గా స్పందించిన సీఎం

ABN, First Publish Date - 2023-04-24T19:44:47+05:30

మొరిండాలోని కొత్వాలీ సాహిబ్ గురుద్వారా (Gurdwara Kotwali Sahib ) అపవిత్ర ఘటనపై పంజాబ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: మొరిండాలోని కొత్వాలీ సాహిబ్ గురుద్వారా (Gurdwara Kotwali Sahib ) అపవిత్ర ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(Bhagwant Mann) తీవ్రంగా స్పందించారు. నిందితుడిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఓ సిక్కు వ్యక్తి గురుద్వారా గర్భగుడిలోకి ప్రవేశించి ఇద్దరు పూజారులపై దాడి చేయడంతోపాటు గురుగ్రంథ్ సాహిబ్‌(Guru Granth Sahib)ను అపవిత్రం చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను బీజేపీ నేత మంజీందర్ సింగ్ సిర్సా ట్విట్టర్‌లో షేర్ చేశారు. యువకుడు తొలుత పూజారిపై దాడిచేసి ఆ తర్వాత గురుగ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. భగవంత్‌ మాన్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అధర్మాన్ని ప్రోత్సహిస్తోందని సిర్సా ఆరోపించారు.

వీడియో వైరల్ అయిన తర్వాత స్పందించిన సీఎం.. మొరిండాలోని గురుద్వారా కొత్వాలి సాహిబ్‌లో తీవ్రంగా ఖండించదగిన ఘటన జరిగిందని, కారుకులైన ఎవరినీ విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. దైవదూషణకు పాల్పడిన ఎవరైనా సరే కఠిన శిక్ష అనుభవించక తప్పదని భగవంత్ మాన్ ట్వీట్ చేశారు.

ఇదే ఘటనపై పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పందించారు. ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన.. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2023-04-24T19:44:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising