ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sanatana dharma row: ఉదయనిధి స్టాలిన్‌కు మద్ధతుగా తమిళనాడు ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. సనాతన ధర్మాన్ని దేనితో పోల్చారో తెలుసా..

ABN, First Publish Date - 2023-09-07T17:08:50+05:30

సనాతన ధర్మం (Sanatana Dharma) డెంగ్యూ, మలేరియా లాంటిదని, నిర్మూలించాలంటూ పిలుపునిచ్చిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తనయుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు (Udayanidhi Stalin) మద్ధతు పెరుగుతోంది. ఉదయనిధికి మద్ధతుగా ఆ రాష్ట్రమంత్రి, డీఎంకే నేత ఎంపీ ఏ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

చెన్నై: సనాతన ధర్మం (Sanatana Dharma) డెంగ్యూ, మలేరియా లాంటిదని, నిర్మూలించాలంటూ పిలుపునిచ్చిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తనయుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు (Udayanidhi Stalin) మద్ధతు పెరుగుతోంది. ఉదయనిధికి మద్ధతుగా ఆ రాష్ట్రమంత్రి, డీఎంకే నేత ఎంపీ ఏ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని సామాజిక రుగ్మతలైన హెచ్‌ఐవీ, కుష్ఠురోగముతో పోల్చాలని అన్నారు. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు మృదువుగానే ఉన్నాయన్నారు. ‘‘ సనాతన ధర్మం, విశ్వకర్మ యోజన విభిన్నమైనవి కావు. అవి రెండూ ఒకటే. ఉదయనిధి స్టాలిన్ మృదువుగానే సరిపోల్చారు. మలేరియా, డెంగ్యూ మాదిరిగా నిర్మూలించాలన్నారు. నిజానికి ఈ రెండు వ్యాధులు సామాజిక రుగ్మత కాదు. నిజాయితీగా చెప్పాలంటే కుష్ఠురోగం అసహ్యకరంగా అనిపిస్తుంది. హెచ్‌ఐవీ కూడా అంతే. కాబట్టి సనాతన ధర్మాన్ని సామాజికంగా ప్రమాదకరమైన హెచ్ఐవీ, కుష్ఠురోగం మాదిరిగా చూడాలి’’ అని ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఎంపీ రాజా అన్నారు.


ఎవరిని తీసుకొచ్చినా సరే సనాతన ధర్మంపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని రాజా అన్నారు. 10 లక్షలు లేదా కోటి మంది అయినా నేను లెక్కచేయను. వాళ్లని ఎలాంటి ఆయుధాలనైనా తెచ్చుకోనివ్వండి. నేనూ ఢిల్లీ వస్తా.. వచ్చి పెరియార్, అంబేడ్కర్ పుస్తకాలతో చర్చ పెడతా’’ అని రాజా వ్యాఖ్యానించారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశపరిస్తే క్యాబినెట్ మంత్రులందరికీ సమాధానం ఇచ్చేందుకు తాను సిద్ధమయ్యానని బుధవారం కూడా రాజా అన్నారు. సనాతన ధర్మం ఏదో తమరే తేల్చుకోవాలని సవాలు విసిరిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-09-07T17:09:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising