ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sandeep Roy Rathore: గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌గా సందీప్‏రాయ్‌ రాథోర్‌

ABN, First Publish Date - 2023-06-30T09:15:41+05:30

గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌గా సందీప్‏రాయ్‌ రాథోర్‌(Sandeep Roy Rathore) నియమితులయ్యారు. ఊనమంజేరిలోని తమిళనాడు పోలీసు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై): గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌గా సందీప్‏రాయ్‌ రాథోర్‌(Sandeep Roy Rathore) నియమితులయ్యారు. ఊనమంజేరిలోని తమిళనాడు పోలీసు అకాడమీలో డీజీపీగా ఉన్న సందీప్‌ రాథోర్‌ను పోలీసు కమిషనర్‌గా నియమిస్తూ రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్‌ కమిషనర్‌ అముద గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

సందీప్‏రాయ్‌ రాథోర్‌ విశేషాలు...

ఢిల్లీకి చెందిన సందీప్‏రాయ్‌ పాఠశాల, కళాశాల విద్యాభ్యాసాన్ని అక్కడే పూర్తి చేశారు. 1992వ సంవత్సరం ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన రాష్ట్ర పోలీసు శాఖలో ఏఎస్పీగా బాధ్యతలు ప్రారంభించి పోలీసు శాఖలో పలు కీలక పదవుల్లో సమర్థవంతంగా పనిచేసి అవార్డులు కూడా దక్కించుకున్నారు. ముఖ్యంగా తూత్తుకుడి జిల్లాఎస్పీ, చెన్నై ట్రాఫిక్‌ విభాగం జాయింట్‌ కమిషనర్‌, డిప్యూటీ కమిషనర్‌, కేంద్ర పారిశ్రామిక భద్రతా విభాగం డీఐజీ, రాష్ట్ర సముద్రతీర భద్రతాదళం ఐటీ తదితర పదవులలో రాణించారు. చెన్నై పోలీసు కమిషనరేట్‌(Chennai Police Commissionerate)ను విభజించి కొత్తగా ఏర్పాటు చేసిన ఆవడి కమిషనరేట్‌ మొట్టమొదటి కమిషనర్‌గా 2022 సంవత్సరం సందీప్‏రాయ్‌ నియమితులయ్యారు. ఆయన ఇటీవల ఊనమంజేరీ ప్రాంతంలోని పోలీసు అకాడమీకి డీజీపీగా పదోన్నతిపై బదలీ అయ్యారు. ప్రస్తుతం గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌గా నియమితులైన ఆయన 2008, 2015 సంవత్సరాల్లో రాష్ట్రపతి అవార్డులు కూడా పొందారు. ఆయనకు పలువురు పోలీసు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2023-06-30T09:15:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising