కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sanjay Raut: కులాల సర్వే ఇప్పటి తక్షణావసరం...కుండబద్ధలు కొట్టిన సంజయ్ రౌత్

ABN, First Publish Date - 2023-10-08T17:20:20+05:30

కులాల సర్వేకు విపక్ష 'ఇండియా' కూటమి సహా సమాజంలోని అన్ని వర్గాలు సానుకూలంగా ఉన్నాయని, కులాల సర్వే చేపట్టడం ఇప్పటి తక్షణ అవసరమని శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. బీహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వం ఇటీవల కులాల సర్వే గణాంకాలను ప్రకటించిన నేపథ్యంలో రౌత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Sanjay Raut: కులాల సర్వే ఇప్పటి తక్షణావసరం...కుండబద్ధలు కొట్టిన సంజయ్ రౌత్

ముంబై: కులాల సర్వేకు (Caster Survey) విపక్ష 'ఇండియా' (I.N.D.I.A.) కూటమి సహా సమాజంలోని అన్ని వర్గాలు సానుకూలంగా ఉన్నాయని, కులాల సర్వే చేపట్టడం ఇప్పటి తక్షణ అవసరమని శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. బీహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వం ఇటీవల కులాల సర్వే గణాంకాలను ప్రకటించడం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు సైతం కులగణనకు సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో సంజయ్ రౌత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


'బీహార్‌లో కులాల సర్వే జరిగింది. రాజస్థాన్‌లోనూ చేపడుతున్నారు. మహారాష్ట్రలో కూడా ఈ డిమాండ్ ఉంది. కులాల సర్వే అనేది ఇప్పటి తక్షణావసరం. సమాజంలోని అన్ని వర్గాలు, ఇండియా కూటమి సైతం ఇందుకు అనుకూలం'' అని రౌత్ అదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.


శివాజీ పులి గోళ్లపై..

శివాజీ పులిగోళ్లను లండన్ నుంచి తీసుకువస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతుండటంపై రౌత్‌ను ప్రశ్నించినప్పుడు, శివాజీ పులిగోళ్ల కచ్చితత్వంపై శివాజీ వారసులకు కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పారు. అవి శివాజీ శకానికి చెందిన పులిగోళ్లు కావచ్చని, అయితే తమకు మాత్రం వాటిపై తిరుగులేని గౌరవం ఉందని చెప్పారు. బీజేపీ భావోద్యేగ రాజకీయాలకు పాల్పడుతోందని, ఎన్నికల్లో ఏక్‌నాథ్ ప్రభుత్వంపై దాడికి ప్రజలు పులిగోళ్లే వాడతారని చమత్కరించారు.


ప్రాంతీయ పార్టీ స్థాయికి బీజేపీ...

ప్రాంతీయ పార్టీలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించడాన్ని రౌత్ తప్పుపట్టారు. భవిష్యత్తులో బీజేపీ ప్రాంతీయ పార్టీల స్థాయికి పడిపోతుందన్నారు. ఎన్డీయే ఎలా ఏర్పడిందని రౌత్ ప్రశ్నించారు. అందులో ఉన్నవన్నీ ప్రాంతీయ పార్టలు కావా అని నిలదీశారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలు ప్రస్తుతం 12 వరకూ ఉన్నాయని చెప్పారు. 2024లో దేశ రాజకీయాలు ప్రాంతీయ పార్టీల బలంతోనే నడుస్తాయని, ప్రాంతీయ పార్టీల సాయంతోనే అటల్ బిహారీ వాజ్‌పేయి ఎన్డీయేను ఏర్పాటు చేసిన విషయం జేపీ నడ్డా మరిచిపోరాదని హితవు పలికారు.

Updated Date - 2023-10-08T17:20:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising