ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Election: వివాహ భోజనంబు.. పోలింగ్‌కు సంకటంబు! ఎన్నికల రోజే 50 వేల పెళ్లిళ్లు

ABN, First Publish Date - 2023-10-11T03:10:55+05:30

రాజస్థాన్‌లో రాజకీయపార్టీలకు పెద్ద చిక్కొచ్చి పడింది. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలను వచ్చే నెల 23న నిర్వహిస్తామని ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించటంతో ఈ

రాజస్థాన్‌లో ఎన్నికల రోజే 50 వేల పెళ్లిళ్లు

పోలింగ్‌ తేదీ మార్చాలంటున్న పార్టీలు

జైపూర్‌, అక్టోబరు 10: రాజస్థాన్‌లో రాజకీయపార్టీలకు పెద్ద చిక్కొచ్చి పడింది. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలను వచ్చే నెల 23న నిర్వహిస్తామని ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించటంతో ఈ సమస్య తలెత్తింది. అదే రోజున దేవ్‌ ఉత్తానీ ఏకాదశి వస్తోంది. వివాహాలకు ఈ రోజును అత్యంత శుభప్రదమైనదిగా రాజస్థానీలు భావిస్తుంటారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరుగుతుంటాయి. ఈసారి కూడా 50 వేలకుపైగా వివాహాలు నవంబరు 23న దేవ్‌ ఉత్తానీ ఏకాదశి సందర్భంగా జరగనున్నాయి. దీనివల్ల లక్షలాది మంది ప్రజలు, వివాహ సామగ్రి వ్యాపారులు పోలింగ్‌కు దూరంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. పోలింగ్‌శాతంపై ఇది ప్రభావం చూపుతుందని రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. పోలింగ్‌ తేదీని మార్చమని ఈసీని కోరుతూ లేఖ రాస్తామని రాష్ట్ర బీజేపీ మంగళవారం ప్రకటించింది. ఇతర పార్టీలు కూడా అభ్యంతరాలను తెలియజేశాయని, ఈ అంశం తమ పరిశీలనలో ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ప్రవీణ్‌ గుప్తా తెలిపారు. మరికొన్ని రోజులు ఆగితేగానీ రాజస్థాన్‌ పోలింగ్‌ తేదీ మార్పుపై స్పష్టత వచ్చేలా లేదు.

Updated Date - 2023-10-11T11:17:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising