ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Supreme court: మీరు పాలించే రాష్ట్రాలకు ఒక లెక్క, మిగతా రాష్ట్రాలకు ఒక లెక్కా?... కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు

ABN, First Publish Date - 2023-07-25T16:31:41+05:30

నాగాలాండ్‌ లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని సుప్రీంకోర్టు మంగళవారంనాడు తప్పుపట్టింది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీసింది.

న్యూఢిల్లీ: నాగాలాండ్‌ (Nagaland)లో మహిళలకు రిజర్వేషన్ (Women reservation) కల్పించడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని సుప్రీంకోర్టు మంగళవారంనాడు తప్పుపట్టింది. భారతీయ జనతా పార్టీ (BJP) అధికారంలో ఉన్న రాష్ట్రాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీసింది. "మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలపై ఎందుకు చర్యలు తీసుకోరు? ఇతర రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు. అదే మీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎలాంటి చర్యలు ఉండవు'' అని అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది.


నాగాలాండ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటూ నాగాలాండ్ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలిచ్చింది. అయితే, ఆ ఆదేశాలను పాటించడం లేదంటూ కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం తాజా వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్ అనేది నిశ్చయాత్మక చర్య అని, మహిళా రిజర్వేషన్ దాని ఆధారంగా ఉంటుందని కోర్టు పేర్కొంది. రాజ్యాంగ నిబంధనలకు భిన్నంగా ఎలా వ్యవహరిస్తారు? నాకు అర్ధంకాకుండా ఉంది'' అని జస్టిస్ ఎస్‌కె కౌల్ వ్యాఖ్యానించారు. విద్య, ఆర్థిక, సామాజిక హోదాలో ఉన్నతంగా ఉన్న రాష్ట్రం నాగాలాండ్ అని, ఆ కారణంగా మహిళలకు రిజర్వేషన్ నిరాకరించరాదని అన్నారు. విచారణ సందర్భంగా బీజేపీ పాలిత మణిపూర్‌లో హింస ప్రస్తావన కూడా వచ్చింది.

Updated Date - 2023-07-25T16:31:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising