ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Adani Group: మరిన్ని కష్టాల్లో చిక్కుకున్న అదానీ గ్రూప్.. సెబీ రిపోర్ట్‌లో సంచలన నిజాలు

ABN, First Publish Date - 2023-08-28T22:49:21+05:30

కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కోట్లకు పడగలెత్తుతూ తిరుగులేని సంస్థగా దూసుకెళ్తున్న అదానీ గ్రూప్‌కు హిండెన్‌బర్గ్ బ్రేకులేసిన విషయం తెలిసిందే! అదానీ గ్రూప్ లిస్టెడ్ స్టాక్‌లో...

కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కోట్లకు పడగలెత్తుతూ తిరుగులేని సంస్థగా దూసుకెళ్తున్న అదానీ గ్రూప్‌కు హిండెన్‌బర్గ్ బ్రేకులేసిన విషయం తెలిసిందే! అదానీ గ్రూప్ లిస్టెడ్ స్టాక్‌లో రిగ్గింగ్ జరిగిందని ఆ రీసెర్చ్ రిపోర్ట్ ఆరోపణలు చేయగానే.. ఆ సంస్థకు కష్టాలు మొదలయ్యాయి. అదానీ గ్రూప్‌లోని లిస్టెడ్ స్టాక్‌లో షేర్స్ పడిపోయాయి. ఆ దెబ్బకు అదానీ గ్రూప్ స్టాక్స్ వాల్యుయేషన్ 100 బిలియన్ డాలర్లు తగ్గింది. దీనికితోడు రాజకీయ పార్టీలు సైతం అదానీ గ్రూప్స్ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించడంతో.. సుప్రీంకోర్టు దర్యాప్తునకు ఆదేశించింది.


సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) తన దర్యాప్తుని ప్రారంభించింది. కొంతకాలం నుంచి విచారిస్తున్న సెబీ.. తాజాగా ఒక సంచలన రిపోర్ట్‌ని బయటపెట్టింది. అదానీ గ్రూప్‌కు చెందిన లిస్టెడ్ ఎంటీటీస్, ఆఫ్‌షోర్ ఫండ్‌ల హోల్డింగ్‌లపై పరిమితుల్ని బహిర్గతం చేయడంపై నిబంధనల్ని ఉల్లంఘించినట్టు సెబీ రిపోర్ట్‌లో తేలింది. ఈ నివేదికను సెబీ ఆగస్టు 29వ తేదీన సమర్పించిన అనంతరం సుప్రీంకోర్టులో అదానీ కేసుపై విచారణ ఉంటుంది. సెబీ రిపోర్ట్ ప్రకారం.. అదానీ గ్రూప్ ఉల్లంఘన కేసు సాంకేతికమైనది. ఇందులో దర్యాప్తు పూర్తయ్యాక పెనాల్టీ విధించే అవకాశం ఉంది. అయితే.. సెబీ ఇంకా తన పూర్తి నివేదికను బహిర్గతం చేయలేదు.

మరోవైపు.. ఆగస్టు 25వ తేదీన అదానీ-హిండెన్‌బర్గ్ కేసు దర్యాప్తుకు సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టులో దాఖలు చేసినట్లు సెబీ తెలిపింది. మొత్తం 24 కేసుల్ని విచారించామని.. అందులో 22 కేసుల దర్యాప్తు పూర్తయ్యిందని సెబీ తన నివేదికలో వెల్లడించింది. ఈ రెండు కేసుల విషయంలో సెబీకి విదేశీ ఏజెన్సీల నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. తమ విచారణలో వెల్లడైన వాస్తవాల ఆధారంగా.. తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని సెబీ పేర్కొంది. కాగా.. ఆ రెండు కేసుల్లో అదానీ గ్రూప్‌కు చెందిన 13 విదేశీ సంస్థలపై విచారణ జరుగుతోంది.

Updated Date - 2023-08-28T22:49:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising