ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TN Seshan: కంచి పీఠాధిపతి చెప్తే తీసుకున్నా.. ఆత్మకథలో ఆసక్తికర విషయాలు...

ABN, First Publish Date - 2023-06-12T02:34:00+05:30

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) పదవికి తాను తగనని మాజీ ప్రధాని రాజీవ్‌, నాటి రాష్ట్రపతి వెంకట్రామన్‌ తనతో అన్నారని మాజీ సీఈసీ, దివంగత టీఎన్‌ శేషన్‌ తన ఆత్మకథలో వెల్లడించారు. ఏ పోస్టూ రాకపోతేనే సీఈసీ పోస్టు చేపట్టాలంటూ హితవు పలికారని అందులో పేర్కొన్నారు. శేషన్‌ ఆత్మకథ ‘త్రూ ది బ్రోకెన్‌ గ్లాస్‌’ను రూప పబ్లికేషన్స్‌ ఆయన మరణానంతరం ప్రచురించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

● సీఈసీ పోస్టుపై శేషన్‌

● తన ఆత్మకథలో వెల్లడి

న్యూఢిల్లీ, జూన్‌ 11: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) పదవికి తాను తగనని మాజీ ప్రధాని రాజీవ్‌, నాటి రాష్ట్రపతి వెంకట్రామన్‌ తనతో అన్నారని మాజీ సీఈసీ, దివంగత టీఎన్‌ శేషన్‌ తన ఆత్మకథలో వెల్లడించారు. ఏ పోస్టూ రాకపోతేనే సీఈసీ పోస్టు చేపట్టాలంటూ హితవు పలికారని అందులో పేర్కొన్నారు. శేషన్‌ ఆత్మకథ ‘త్రూ ది బ్రోకెన్‌ గ్లాస్‌’ను రూప పబ్లికేషన్స్‌ ఆయన మరణానంతరం ప్రచురించింది. తాను సీఈసీ పదవిని ఎలా చేపట్టాల్సి వచ్చిందనేది శేషన్‌ అందులో ఇలా వివరించారు. ‘1990లో అనారోగ్యంతో నాటి సీఈసీ పేరిశాస్త్రి మరణించారు. అప్పుడు కేంద్రం న్యాయ శాఖ కార్యదర్శి రమాదేవిని యాక్టింగ్‌ సీఈసీగా నియమించింది. ఆమె బాధ్యతలు చేపట్టిన నాలుగో రోజు కేబినెట్‌ కార్యదర్శి వినోద్‌ పాండే నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. అప్పుడు ప్రణాళికాసంఘం సభ్యుడిగా ఉన్న నాకు సీఈసీ పదవి ఇవ్వాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలిపారు. వేకువజామున 2 గంటలకు రాజీవ్‌గాంధీకి ఫోన్‌ చేశాను. 2.30 కల్లా ఆయన దగ్గరకు వెళ్లాను. సీఈసీ పోస్టు నీకు మంచిది కాదు. ప్రత్యామ్నాయంగా ఏ పోస్టూ లేకపోతేనే సీఈసీ పదవి తీసుకో అని ఆయన సలహా ఇచ్చారు. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి వెంకట్రామన్‌కు విషయం చెప్పాను. సీఈసీ పదవి నీకు కరెక్టు కాదు అన్నారు. దీంతో, అయోమయంలో పడ్డాను. చివరకు కంచి శంకరాచార్య (జయేంద్ర సరస్వతి) సలహా కోరాను. సీఈసీ చాలా బాధ్యతాయుతమైన పదవి.. చేపట్టాలని ఆయన సూచించారు. వెంటనే మంత్రికి ఫోన్‌ చేసి పదవి చేపట్టేందుకు సంసిద్ధత తెలిపాను’ అని శేషన్‌ వివరించారు. 1990 డిసెంబరు 12న ఎన్నికల కమిషనర్‌గా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. సీఈసీ పదవి తనకు సంతృప్తినిచ్చిందని శేషన్‌ చెప్పారు.

Updated Date - 2023-06-12T10:11:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising