Delhi Car Horror: అంజలి కుటుంబానికి బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఫౌండేషన్ ఆర్థిక సాయం

ABN, First Publish Date - 2023-01-07T21:25:44+05:30

దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 1న తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అంజలి సింగ్ (Anjali Singh) కుటుంబానికి బాలీవుడ్ ప్రముఖ నటుడు

Delhi Car Horror: అంజలి కుటుంబానికి బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఫౌండేషన్ ఆర్థిక సాయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 1న తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అంజలి సింగ్ (Anjali Singh) కుటుంబానికి బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్‌(Shah Rukh Khan)కు చెందిన దాతృత్వ సంస్థ ‘మీర్ ఫౌండేషన్’(Meer Foundation) అండగా నిలిచింది. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించింది. అయితే, ఎంత మొత్తం అన్న విషయాన్ని బయటపెట్టలేదు.

స్కూటర్‌పై వెళ్తున్న 20 ఏళ్ల అంజలిని ఢీకొట్టిన కారు ఆమెను దాదాపు 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన అంజలి ప్రాణాలు కోల్పోయింది. తల్లి, చెల్లెళ్లు, తమ్ముళ్లతో కలిసి నివసిస్తున్న అంజలి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చింది. రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది.

అంజలి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన మీర్ ఫౌండేషన్.. అనంతరం మాట్లాడుతూ.. అంజలి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపింది. మరీ ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తల్లికి, తోబుట్టువులకు తగినంత సాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొంది.

Updated Date - 2023-01-07T21:25:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising