ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KSRTC: వామ్మో.. కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో లేడీస్‌కు ఫ్రీ జర్నీ ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉందో చూడండి..!

ABN, First Publish Date - 2023-06-19T13:47:13+05:30

వారం క్రితం వరకూ సాదాసీదాగా తిరిగిన కర్ణాటక ఆర్టీసీ బస్సులు ఒక్కసారిగా కిటకిటలాడుతున్నాయి. ఏ ఊరి బస్సు చూసినా జాతర, తిరుణాళ్ల వేళను తలపిస్తున్నాయి. కిటకిటలాడుతున్న ప్రయాణికులతో ఆర్టీసీ కండక్టర్లకు టికెట్లు కొట్టడానికి కూడా కాలుమోపలేని పరిస్థితి నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉచిత ప్రయాణంతో ఆర్టీసీకి మహిళల తాకిడి

నిత్యం కోటి మందికి పైగానే ప్రయాణం

కిటకిటలాడుతున్న ఆలయాలు

వెలవెలబోతున్న ఏసీ బస్సులు

రైల్వేకు తగ్గిన కలెక్షన్‌

రద్దీతో విద్యార్థులకు తిప్పలు

వారం క్రితం వరకూ సాదాసీదాగా తిరిగిన కర్ణాటక ఆర్టీసీ బస్సులు ఒక్కసారిగా కిటకిటలాడుతున్నాయి. ఏ ఊరి బస్సు చూసినా జాతర, తిరుణాళ్ల వేళను తలపిస్తున్నాయి. కిటకిటలాడుతున్న ప్రయాణికులతో ఆర్టీసీ కండక్టర్లకు టికెట్లు కొట్టడానికి కూడా కాలుమోపలేని పరిస్థితి నెలకొంది. దీనంతటికీ కారణం.. ‘శక్తి యోజనె’ అనే పథకమే. ఈ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కర్ణాటక రాష్ట్రమంతా ఉచితంగా తిరిగే అవకాశం కల్పించారు. దీంతో మహిళలు ఒక్కసారిగా తెగ ప్రయాణం చేస్తున్నారు. ప్రత్యేకించి ఆలయాల దర్శనానికి పెద్దఎత్తున తరలి వెళుతున్నారు. రోజూ సరాసరిగా కోటి మందికి పైగానే ప్రయాణం చేస్తున్నారు.

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల హామీల్లో ప్రకటించిన గ్యారెంటీలలో ఒక్కటైన శక్తి పథకం రాష్ట్రంలో కొత్త పుంతలు తొక్కుతోంది. సిద్దరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి గ్యారెంటీగా మహిళలు ఉచితంగా ప్రయాణించే పథకాన్ని అమలు చేశారు. ఇప్పటికే వారం రోజులు ముగిసింది. రాష్ట్రంలో కేఎ్‌సఆర్టీసీ, బీఎంటీసీ, వాయువ్య కర్ణాటక, కల్యాణ కర్ణాటక పేరిట నాలుగు కార్పొరేషన్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు సర్వీసులు దశాబ్దాల కాలంగా కొనసాగుతున్నాయి. దక్షిణభారత్‌లో ఆర్టీసీ సుస్థిరమైన సేవలు కొనసాగించే రాష్ట్రంగాను పేరుంది. నాలుగు కార్పొరేషన్ల ద్వారా రోజూ 70-80 లక్షల మంది ప్రయాణాలు సాగించేవారు. వీరిలో ఎక్కువ మంది బెంగళూరు నగర పరిధిలో సంచరించేవారు. వీటికి తోడు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, గోవాకు కర్ణాటక నుంచి బస్సు సర్వీసులు ఉన్నాయి. ప్రస్తుతం శక్తి గ్యారెంటీ ద్వారా మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. తొలి మూడు రోజులు సాధారణంగా ఉన్నా ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజుకు సగటున 1.16 కోట్ల మంది ప్రయాణించారు. దీన్నిబట్టి ప్రతిరోజూ 35-40 లక్షల మంది అధికంగా ప్రయాణం చేస్తున్నారు.

నామమాత్రంగా ఏసీ సర్వీసులు

శక్తి గ్యారెంటీ సాధారణ సర్వీసులకు మాత్రమే వర్తింప చేశారు. ఏసీ సర్వీసులైన అంబారీ ఉత్సవ, అంబారీ డ్రీమ్స్‌ క్లాస్‌, పవర్‌ ప్లస్‌, ఐరావత క్లబ్‌ క్లాస్‌, రాజహంస బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య తగ్గింది. వీటిలో ఎక్కువ రాత్రి సర్వీసులు ఉండడం, గ్యారెంటీ వర్తించకపోవడంతో ప్రయాణికులు తగ్గారు. 39 సీట్లు కల్గిన రాజహంస, ఓల్వోలలో సాధారణంగా 30-35 మంది ప్రయాణించేవారు. వారం రోజులుగా ఆ సంఖ్య 20లోపే ఉంది. ఏళ్ల తరబడి ఏసీ సర్వీసులు పరిశీలిస్తే వారాంతంలో రద్దీగా ఉండేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి కూడా లేకపోయింది.

విద్యార్థులకు కొత్త కష్టాలు

పాఠశాలలు ప్రారంభమైన తరుణంలోనే శక్తి గ్యారెంటీ కూడా అమలులోకి వచ్చింది. ఉదయం వేళల్లో విద్యార్థులు ఎక్కువ మంది బస్సుల్లో ప్రయాణించేవారు. బెంగళూరు సహా అన్ని ప్రాంతాల్లోనూ జిల్లా కేంద్రాలు, తాలూకా కేంద్రాల పరిధిలోని పీయూ, డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్‌ కళాశాలలకు వెళ్లేవారు. ప్రస్తుతం శక్తి అమలు కావడంతో మహిళలు బస్సుల్లో నిండిపోతున్నారు. విద్యార్థులు సకాలంలో తరగతులకు చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఫస్ట్‌ పీరియడ్‌కు విద్యార్థులు చేరుకోలేకపోతున్నారని తెలుస్తోంది.

రైల్వేకు షాక్‌

రాష్ట్రంలో రైళ్లలో ప్రయాణించేవారి సంఖ్య ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో యథావిధిగా సాగుతున్నాయి. మెము, డెముతోపాటు బెంగళూరు నుంచి ప్రధాన నగరాలకు వెళ్లే అన్ని రైళ్లలోనూ ప్రయాణికులు తగ్గారు. సాధారణంగా ప్రతిరోజూ 2.35 లక్షల మంది రైల్వేలో ప్రయాణించేందుకు టికెట్లు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం 2 లక్షలలోపు టికెట్లు అమ్ముడుపోతున్నట్టు రైల్వే అధికారుల ద్వారా తెలుస్తోంది.

కిటకిటలాడుతున్న ధార్మిక కేంద్రాలు

శక్తి పథకం అమలు తర్వాత ధార్మిక కేంద్రాల్లో భక్తులు కిటకిటలాడుతున్నారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు ధర్మస్థళ మంజునాథ స్వామి, కుక్కె సుబ్రహ్మణ్య, ఉడుపి శ్రీకృష్ణ, హొరనాడు అన్నపూర్ణేశ్వరి, ఉత్తరకన్నడ జిల్లా మురుడేశ్వర, మలె మహదేశ్వర, మైసూరు చాముండేశ్వరి దేవి, సిగందూరు చౌడేశ్వరి దేవి, సవదత్తి ఎల్లమ్మ తదితర ఆలయాలకు రోజూ వేలాదిమంది భక్తులు తరలివెళ్తున్నారు. సాధారణ దర్శనాలకు పదింతలకుపైగా భక్తులు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ధర్మస్థళలో శని, ఆదివారాలలో లక్ష మంది చొప్పున దర్శనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే పరిస్థితి అన్ని ఆలయాలకు నెలకొంది.

పోటాపోటీ..

బస్టాండ్లలో మహిళలు వందల్లో ఉండడంతో బస్సుల్లో ప్రవేశించేందుకు పోటాపోటీ పడుతున్నారు. పలుచోట్ల డ్రైవర్‌ కిటికీల్లోనూ ఎక్కేస్తున్నారు. ఇక అత్యవసర ద్వారం కూడా తెరిచేస్తున్నారు. చామరాజనగరలో బస్సులో ప్రవేశించేందుకు పోటీ పడిన మహిళలు ఏకంగా డోర్‌ను లాగేశారు. బెంగళూరుకు చెందిన సునంద అనే మహిళ ఏకంగా బస్సును రిజర్వు చేసుకునేందుకు వచ్చారు. సగం సీట్లలో మహిళలు ఉంటామని, మిగిలిన సీట్లలో మా కుటుంబీకులు ఉంటారని ప్రతిపాదన పెట్టారు. ప్రతిచోటా బస్సులు పెంచే పరిస్థితి ఏర్పడింది.

రద్దీ ప్రభావం.. విరిగిన బస్సు డోర్‌

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాక వారి సంచారం అధికమైంది. చామరాజనగరలో రద్దీ అధికమై ఏకంగా బస్సు డోర్‌ విరిగిపోయిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. అమావాస్య నేపథ్యంలో మలె మహదేశ్వర కొండకు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. దీనికి తోడు సెలవు రోజు కావడంతో భక్తులు మరింత పెరిగారు. ప్రయాణికుల తోపులాటలో ఏకంగా బస్సు డోర్‌ ఊడి వచ్చింది. ప్రముఖ యాత్రా స్థలాలకు ప్రయాణికుల డిమాండ్‌ మేరకు తగినన్ని ఆర్టీసీ బస్సులు లేకపోవడం, మహిళలకు ఉచిత ప్రయాణం కావడంతో గడిచిన వారం రోజుల్లో ఎటు చూసినా బస్సులు నిండుగా ఉంటున్నాయి. ఉచిత ప్రయాణం నేపథ్యంలో కొన్ని రూట్లలో మరోవైపు బస్సుల్లో సీట్లన్నీ మహిళలకే సరిపోతున్నాయని కనీసం నిలబడేందు కు కూడా స్థలం ఉండడం లేదనే విమర్శలు ఉన్నాయి.

Updated Date - 2023-06-19T13:47:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising