Shashi Tharoor: ‘వరల్డ్ యోగా డే’ సందర్భంగా ఆ ప్రధానిని కూడా గుర్తుచేసుకోవాలి
ABN, First Publish Date - 2023-06-21T16:00:43+05:30
యోగా ప్రధాన్యతను ప్రపంచానికి చాటిచెప్పిన మరొకరిని కూడా ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్. యోగా అవసరాన్ని మొట్టమొదట గుర్తించి, విశ్వవ్యాప్తం చేసేందుకు మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కృషి చేశారని శశిధరూర్ అన్నారు.
న్యూఢిల్లీ: యోగా ప్రధాన్యతను ప్రపంచానికి చాటిచెప్పిన మరొకరిని కూడా ప్రపంచ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్(Shashi Tharoor). యోగా అవసరాన్ని మొట్టమొదట గుర్తించి, విశ్వవ్యాప్తం చేసేందుకు మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కృషి చేశారని శశిధరూర్ అన్నారు.
కాగా.. వరల్డ్ యోగాడే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నెహ్రూ యోగా చేస్తున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘ప్రపంచ స్థాయిలో యోగాకు గుర్తింపు తెచ్చేందుకు జాతీయ విధానాలను రూపొందించిన నెహ్రూ గారికి కృతజ్ఞతలు. శారీరక ధృఢత్వంతోపాటు మానసికంగా చైతన్యం, ఉల్లాసాన్ని అందించే అత్యంత ప్రాచీన విద్య యోగాను మనందరం ఆచరిద్దాం’’ అని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.
కాంగ్రెస్ పార్టీ ట్వీట్‌కు కొనసాగింపుగా శశిధరూర్ స్పందించారు. ప్రపంచ స్థాయిలో యోగా ప్రాచుర్యాన్ని తెలియజెప్పడంలో కృషి చేసిన ప్రస్తుత ప్రభుత్వంతోపాటు ప్రతిఒక్కరికి గుర్తింపు దక్కాలి. ప్రస్తుత ప్రభుత్వం కంటే ముందే మాజీ ప్రధాని నెహ్రూ యోగాకు అత్యంత ప్రధాన్యత ఇచ్చారని..ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు నెహ్రూ ప్రభుత్వం కృషి చేసిందని శశథరూర్ గుర్తుచేశారు. యోగాతో మానసిక చైతన్యం పెంపొందిస్తుందని నేను ఎప్పటినుంచో చెబుతున్నాను. ఐక్యరాజ్యసమితి ద్వారా యోగా విశిష్టతను ప్రపంచానికి తెలియజెప్పడం గొప్ప విషయం అని శశిధరూర్ ట్వీట్ చేశారు.
******************************
ఇవి కూడా చదవండి..
******************************
Mumbai Covid Scam: ఆదిత్యా థాక్రే సన్నిహితుల ఇండ్లలో ఈడీసోదాలు
******************************
BMC COVID scam: ఏకంగా రూ.12 వేల కోట్ల కరోనా స్కాం.. రంగంలోకి ఈడీ
******************************
Updated Date - 2023-06-21T16:59:17+05:30 IST