ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Madhya Pradesh: లోక్‌సభ ఎన్నికల వరకూ సీఎం ఆయనే..

ABN, First Publish Date - 2023-12-04T14:51:38+05:30

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు-2023లో బీజేపీ 164 సీట్లు గెలుచుకుని మరోసారి అధికారంలోకి వచ్చింది. సీఎం ఎవరనేది బీజేపీ అధిష్ఠానం ఇంకా ప్రకటించనప్పటికీ 2024 లోక్‌సభ ఎన్నికల వరకూ శివరాజ్ సింగ్‌నే సీఎంగా కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు-2023 (Madhya Pradesh Assembly Elections)లో బీజేపీ 164 సీట్లు గెలుచుకుని మరోసారి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్-బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులుగా చేస్తూ బీజేపీ భారీ మెజారిటీ సాధించింది. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెరుగుపడ్డాయి. దీనిపై బీజేపీ అధిష్ఠానం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ 2024 లోక్‌సభ ఎన్నికల వరకూ శివరాజ్ సింగ్‌నే సీఎంగా కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.


ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 127 స్థానాలను అవలీలగా దాటి బీజేపీ 164 సీట్లు సాధించింది. దీంతో సిఎం మార్పు విషయంలో పార్టీపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండే అవకాశం లేదని నిపుణుల అంచనా. బీజేపీ ఘనవిజయం సాధించకపోయి ఉంటే శివారాజ్ సింగ్‌‌ను సీఎంగా కొనసాగించే విషయంలో ఆయన విధేయ ఎమ్మెల్యేల నుంచి రాజీనామాల ముప్పు తలెత్తే అవకాశం ఉండేదని, భారీ మెజారిటీ రావడం వల్ల కొందరు ఎమ్మెల్యేలు అసమ్మతి తెలిపినా శివరాజ్ సీఎం పదవిని దక్కించుకునేందుకు అది ఏమాత్రం అడ్డంకి కాబోతోదని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిగా శివరాజ్ సింగ్ పేరును బీజేపీ ప్రకటించనప్పటికీ, ఆయనను మార్చినట్లయితే అది రాబోయే లోక్‌సభ ఎన్నికలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని వారు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే 2024 లోక్‌సభ ఎన్నికల వరకూ ఆయననే సీఎంగా కొనసాగించే అవకాశాలు బలంగా ఉన్నయని చెబుతున్నారు. బుద్ని నియోజకవర్గం నుంచి శివరాజ్ భారీ ఆధిక్యంతో గెలుపొందారు.

Updated Date - 2023-12-04T14:51:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising