ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sivaraj meets Nadda: నడ్డాతో శివరాజ్ సింగ్ భేటీ... కొత్త పాత్రపై ఊహాగానాలు

ABN, Publish Date - Dec 19 , 2023 | 02:27 PM

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను న్యూఢిల్లీలో మంగళవారంనాడు కలుసుకున్నారు. సమావేశం ఎజెండా ఏమిటనేది ప్రకటించనప్పటికీ ఆయనకు పార్టీ ఎలాంటి బాధ్యత అప్పగించనుందనే విషయంలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ (Sivaraj singh chouhan) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda)ను న్యూఢిల్లీలో మంగళవారంనాడు కలుసుకున్నారు. సమావేశం ఎజెండా ఏమిటనేది ప్రకటించనప్పటికీ ఆయనకు పార్టీ ఎలాంటి బాధ్యత అప్పగించనుందనే విషయంలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీకి శివరాజ్ పెద్ద ఆస్తి అని, త్వరలోనే ఆయనకు మరింత పెద్ద బాధ్యత అప్పగించనున్నామని నడ్డా, హోం మంత్రి అమిత్ షా పదేపదే చెబుతూ వస్తున్నారు.


చావనైనా చస్తా కానీ...

తన కోసం ఫలానాది చేయమని పార్టీని అడగనని, అంతకంటే చావడానికైనా తాను సిద్ధమని ఇటీవల శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా హుందాగా స్వీకరిస్తానని చెప్పారు. ఇటీవల మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించినప్పటికీ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన శివరాజ్ సింగ్‌కు బదులుగా మోహన్ యాదవ్‌కు సీఎం పదవిని పార్టీ అధిష్ఠానం కట్టబెట్టింది.


శివరాజ్ సింగ్ చౌహాన్ 2005 నవంబర్ నుంచి 2018 డిసెంబర్ వరకూ ఒకసారి, మార్చి 2020 నుంచి డిసెంబర్ 2023 వరకూ మరోసారి సీఎంగా చేశారు. 2018 ఎన్నికల్లో పార్టీ ఓటమి చవిచూసినప్పటికీ 2020లో కాంగ్రెస్‌లో చీలిక రావడంతో ఆయన మరోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానంతరం మరోసారి ఆయనకు సీఎం పగ్గాలు అప్పగిస్తారనే ఊహాగానాలు వినిపించినప్పటికీ శివరాజ్ మాత్రం.. బీజేపీ ఒక మిషన్ అని, ప్రతి కార్యకర్తకు ఏదో పని ఉంటుందని, తనకు ఏ బాధ్యత అప్పగించినా నిర్వహించేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని ఎంపీ స్థానాల్లోనూ పార్టీని గెలిపించడమే ఇప్పుడు తన ముందున్న లక్ష్యమని చెప్పారు.

Updated Date - Dec 19 , 2023 | 02:33 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising