Indian Students: అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్ధులకు షాక్..
ABN, First Publish Date - 2023-08-18T15:31:34+05:30
న్యూఢిల్లీ: అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్ధులకు షాక్ తగిలింది. వీసా ఉన్నా ఇమిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపుతున్నారు. అమెరికా నుంచి 21 మంది విద్యార్ధులను వెనక్కి పంపారు. అమెరికాలోని వివిధ యూనివర్శిటీలలో చేరేందుకు భారతీయ విద్యార్ధులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు.
న్యూఢిల్లీ: అమెరికా (America) వెళ్లిన భారతీయ విద్యార్ధులకు (Indian Students) షాక్ (Shock) తగిలింది. వీసా (Visa) ఉన్నా ఇమిగ్రేషన్ అధికారులు (Immigration Authorities) వెనక్కి పంపుతున్నారు. అమెరికా నుంచి 21 మంది విద్యార్ధులను వెనక్కి పంపారు. అమెరికాలోని వివిధ యూనివర్శిటీ (University)లలో చేరేందుకు భారతీయ విద్యార్ధులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. అమెరికాలో అడుగుపెట్టిన తరువాత కూడా సరైన సర్టిఫికెట్లు లేని విద్యార్ధులను అధికారులు వెనక్కి పంపుతున్నారు. గత గురువారం 21 మంది విద్యార్ధులను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపారు. శాన్ ఫ్రాన్సిస్కో (San Francisco), షికాగో (Chicago) విమానాశ్రయాల నుంచే రిటర్న్ ఫ్లైట్‌లను అధికారులు ఎక్కించారు. వెనక్కి వచ్చిన 21 మంది భారతీయుల్లో తెలుగువారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. విమానాశ్రయాల్లో దిగిన వెంటనే అనుమానాస్పదంగా ఉన్న వారి సర్టిఫికెట్లను ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీ చేస్తున్నారు.
సాధారణ తనిఖీల్లో పట్టుబడిన విద్యార్ధులు.. వారు చేరనున్న యూనివర్శిటీ ఫీజులు, బ్యాంకు స్టేట్ మెంట్‌లు, వారి ఆర్ధిక స్థోమత తదితర విషయాలపై ఎంబసీలో ఇచ్చిన వివరాలకు సరిపోలేదని అధికారులు నిర్ధారించుకున్నారు. ఫోన్లు, మెయిళ్లు, కన్సల్టెన్సీలతో జరిపిన వాట్సాప్ చాట్‌లను కూడా అధికారులు పరిశీలించి.. చప్పుడు చేయకుండా వెనక్కి వెళ్లిపోవాలని విద్యార్దులకు అల్టిమేటం జారీచేశారు. అభ్యంతరం వ్యక్తం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని విద్యార్ధులను హెచ్చరించారు. గతంలో కూడా ఇదే విధంగా అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు పలువురు విద్యార్ధులను వెనక్కి పంపారు. దీంతో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారుల వైఖరిపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వీసా వచ్చిన విద్యార్ధులను డిపాల్ట్ చేయడాన్ని సీరియస్‌గా పరిగణిస్తోంది. అమెరికన్ ఎంబసీతో భారత విదేశాంగ శాఖ అధికారులు చర్చలు జరుపుతున్నారు.
Updated Date - 2023-08-18T16:53:56+05:30 IST