ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Siddaramaiah, BJP: సిద్దూను ఢీకొనే సత్తా ఎవరికుంది?

ABN, First Publish Date - 2023-06-06T13:14:34+05:30

మూడున్నరేళ్లపాటు తిరుగులేని రీతిలో పాలన సాగించిన బీజేపీకి రాష్ట్రంలో చిక్కుముడులు పెరుగుతున్నాయి. శాసనసభ ఎన్నిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ప్రతిపక్షనేత ఎంపికకు కమలనాథుల కసరత్తు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): మూడున్నరేళ్లపాటు తిరుగులేని రీతిలో పాలన సాగించిన బీజేపీకి రాష్ట్రంలో చిక్కుముడులు పెరుగుతున్నాయి. శాసనసభ ఎన్నికలకు ముందు నుంచే ఇక తమ విజయాన్ని అడ్డుకోలేరనే ధీమాలో కొనసాగారు. స్పష్టమైన మెజారిటీ వస్తే ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే ఆశల పల్లకీలో తేలియాడారు. ఫలితాలు బీజేపీని కోలుకోలేని రీతిలో దెబ్బతీశాయి. మే 13న శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్‏కు 135 స్థానాలు సాధ్యం కావడంతో తిరుగులేని మెజారిటీ వచ్చింది. సీఎంగా సిద్దరామయ్య అంచలంచెలుగా ప్రభుత్వాన్ని గాడిన పెట్టే పనిలో పడ్డారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే డీసీఎంగా డీకే శివకుమార్‌ సహా 8మంది సీనియర్లను కేబినెట్‌లో చేర్చుకున్నారు. తర్వాత వారానికి మిగిలిన అన్ని స్థానాలకు మంత్రులను భర్తీ చేశారు. ప్రస్తుతం సిద్దరామయ్య కేబినెట్‌ 34 మందితో భర్తీ అయింది. మరోవైపు శాఖల కేటాయింపుతో మరో రెండు అడుగులు ముందుకెళ్లారు. అధికార కాంగ్రెస్‏లో ఇంత జరుగుతున్నా ప్రతిపక్ష స్థానంలో ఉండే బీజేపీ కనీసంగా నేతను ఎంచుకునేందుకు మల్లగుల్లాలు పడుతోంది. సిద్దరామయ్య(Siddaramaiah) పథకాల అమలులోనే కాకుండా సొంత పార్టీకి చెందినవారిని కలుపుకుపోవడంలో తిరుగులేదనే పేరు పొందారు. శాసనసభలో గడిచిన పదేళ్లలో సిద్దరామయ్యను ధీటుగా ఎదుర్కొనేందుకు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆచి తూచి వ్యవహరించాలనే భావించేవారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కావడంతో ఆయన మాటల ధాటికి ధీటుగా ఎదుర్కొనే నేత ఎవరనే ప్రశ్నకు సమాధానమే లేకుండా పోతోంది. బీజేపీ(BJP) అధిష్టానం జాతీయ స్థాయిలో ఎన్నో సంచలనాత్మకమైన మార్పులు ప్రయోగించింది. గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా మంత్రులనే పక్కనపెట్టి ఎన్నికల్లో ప్రభావం చూపింది. కానీ కర్ణాటకలో చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. ప్రస్తుతం ఎవరికి ప్రతిపక్షనేత హోదా కల్పిస్తే అధికార పార్టీని ఎదుర్కోగలరనే అంచనాలు వేస్తోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ అరుణ్‌సింగ్‌ బెంగళూరుకు వచ్చి కీలక నేతలతో సమీక్ష జరిపారు.

కానీ ప్రతిపక్షనేత అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. ఆయన బెంగళూరు నుంచి వెనుతిరిగి దాదాపు రెండువారాలవుతోంది. ఇటు రాష్ట్ర నేతలు తేల్చే పరిస్థితి లేదు. అటు అధిష్టానం ఢిల్లీకి పిలిచి చర్చల ద్వారా ఖరారు చేయాలని ఆలోచించడం లేదు. ముఖ్యమంత్రిగా కొనసాగిన బసవరాజ్‌ బొమ్మై(Basavaraj Bommai) ధీటుగా ఎదుర్కోలేక పోవడంతోనే ఎన్నికల్లో ఘోర ఓటమికి కారణమైందని పార్టీలోని కొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆయనను మినహాయిస్తే ఎవరికీ ఇవ్వాలనే అశంపై పార్టీలో గందరగోళం నెలకొంది. యడియూరప్ప(Yeddyurappa) సభలో కొనసాగిన దశాబ్దాలకాలంపాటు ఈ ప్రశ్నకు అవకాశమే లేదు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఆయన తప్పుకోవడంతో కనీసం ప్రతిపక్షనేతను ఎంపిక చేసే విషయమై పార్టీ అయోమయంలో పడింది.

Updated Date - 2023-06-06T13:14:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising