Siddaramaiah: గృహ జ్యోతి షురూ... ప్రధానికి సీఎం కౌంటర్..!
ABN, First Publish Date - 2023-08-05T18:56:37+05:30
కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఐదు హామీల్లో ఒకటైన 'గృహ జ్యోతి' పథకం కలబురగి నుంచి శనివారం ప్రారంభమైంది. ఈ పథకాన్ని సిద్ధరామయ్య, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఇతర మంత్రులు కలిసి ప్రారంభించారు.
కలబురగి: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఐదు హామీల్లో ఒకటైన 'గృహ జ్యోతి' (Gruha Jyothi) పథకం కలబురగి నుంచి శనివారం ప్రారంభమైంది. ఈ పథకాన్ని సిద్ధరామయ్య, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఇతర మంత్రులు కలిసి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో గృహావసరాల కోసం విద్యుత్‌ను ఉపయోగించుకునే లబ్ధిదారులకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ సౌకర్యం లభిస్తుంది.
'గృహ జ్యోతి' పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ, కర్ణాటకలో ఉచిత పథకాలు అమలు చేస్తే రాష్ట్రం దివాళా తీస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారని, అయితే, పథకాలకు నిధులు కేటాయించినప్పటికీ దివాళా తీసే పరిస్థితి రాలేదని అన్నారు. గత బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి దోచుకుందని, ఫలితంగా ధరలు చుక్కలనంటడంతో పాటు నిరుద్యోగం పెరిగిపోయిందని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వంలో 14 లక్షలకు పైగా ఇళ్లు నిర్మించామని, బీజేపీ మూడేళ్లలో కేవలం 5 లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించిందని అన్నారు.
Updated Date - 2023-08-05T18:56:37+05:30 IST