ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Karnataka : సిద్ధరామయ్యపై డీకే శివ కుమార్ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-06-28T12:11:58+05:30

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2017లో హెబ్బల్ స్టీల్ ఫ్లైఓవర్ విషయంలో నిరసనలకు సిద్ధరామయ్య భయపడిపోయారన్నారు.

DK Shiva Kumar, Sidharamaiah
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah)పై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ (Deputy chief minister DK Shivakumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. 2017లో హెబ్బల్ స్టీల్ ఫ్లైఓవర్ విషయంలో నిరసనలకు సిద్ధరామయ్య భయపడిపోయారని, తాను అయి ఉంటే నిరసనలకు భయపడి ఉండేవాడిని కాదని అన్నారు.

బెంగళూరు జిల్లా వ్యవస్థాపకుడు నాదప్రభు కెంపెగౌడ 514వ జయంత్యుత్సవాలు కర్ణాటక విధాన సభలో మంగళవారం జరిగాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కెంపెగౌడకు నివాళులర్పించారు. బెంగళూరు అభివృద్ధికి కారణం కెంపెగౌడ దార్శనికత అని తెలిపారు. ఆయన గొప్ప పరిపాలకుడని కొనియాడారు.

కెంపెగౌడకు నివాళులర్పించిన అనంతరం డీకే శివ కుమార్ మాట్లాడుతూ, 2017లో అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అప్పటి బెంగళూరు నగర అభివృద్ధి శాఖ మంత్రి కేజే జార్జి నగరంలో స్టీల్ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి వెనుకంజ వేశారని చెప్పారు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ జరిగిన నిరసనలకు వీరిద్దరూ భయపడిపోయారని అన్నారు. అదే తాను అయి ఉంటే, నిరసనకారులు చేసే తాటాకు చప్పుళ్లకు లొంగిపోయేవాడిని కాదన్నారు. పర్యవసానాలు ఏమైనప్పటికీ ప్రాజెక్టును నిర్మించి ఉండేవాడినన్నారు. నగరానికి భవిష్యత్తులో మేలు చేసే కఠిన నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు.

బసవేశ్వర నగర్ నుంచి హెబ్బల్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రాజెక్టును నిర్మించాలని 2017లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే స్థానికులు తీవ్ర నిరసన తెలపడంతో వెనుకంజ వేసింది. హెబ్బల్ ప్రాంతంలో రద్దీని తగ్గించేందుకు ఈ వంతెనను నిర్మించాలని ప్రయత్నించారు. సెంట్రల్ బెంగళూరు నుంచి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేవారికి ఈ వంతెన చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

బెంగళూరు నగర అభివృద్ధి శాఖ మంత్రి పదవిని డీకే శివ కుమార్ నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Rajya Sabha polls : మూడు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జూలైలో

UCC Vs Congress : ఉమ్మడి పౌర స్మృతిపై చిదంబరం ఘాటు వ్యాఖ్యలు

Updated Date - 2023-06-28T12:11:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising