Delhi Shastri Park: మస్కిటో కాయిల్ పొగ ఇంత డేంజరా.. పాపం.. ఒకే కుటుంబంలో ఆరుగురు చనిపోయారు..!
ABN, First Publish Date - 2023-03-31T11:45:19+05:30
దోమల బాధ నుంచి తప్పించుకోవడం కోసం ఉపయోగించే మస్కిటో కాయిల్స్ ప్రాణాంతకంగా మారుతున్నట్లు కనిపిస్తోంది
న్యూఢిల్లీ : దోమల బాధ నుంచి తప్పించుకోవడం కోసం ఉపయోగించే మస్కిటో కాయిల్స్ ప్రాణాంతకంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. వీటి నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ వాయువు దోమలను ఏ మేరకు నిరోధిస్తోందో తెలియడం లేదు కానీ, ఆరుగురి ప్రాణాలను మాత్రం తీసినట్లు తెలుస్తోంది. ఒకే కుటుంబంలోని ఆరుగురు మరణించడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
న్యూఢిల్లీలోని నార్త్ఈస్ట్ జిల్లా డీసీపీ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, శాస్త్రి పార్క్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులు మస్కిటో కాయిల్స్ నుంచి వచ్చిన కార్బన్ మోనాక్సైడ్ వాయువును పీల్చడం వల్ల ప్రాణాలు కోల్పోయారు. వీరు రాత్రంతా ఈ కాయిల్స్‌ను పెట్టుకుని, నిద్రపోతూ, వాటి నుంచి వచ్చిన వాయువును పీల్చినట్లు తెలిపారు.
మస్కిటో కాయిల్స్ వల్ల ఇటువంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయి. ధూమపానం చేయడం వల్ల జరిగే నష్టం కన్నా దోమల నిరోధక చక్రాల నుంచి వెలువడే వాయువు వల్ల జరిగే నష్టం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై హుష్ మనీ కేసు
Digvijaya Vs Kapil : దిగ్విజయ సింగ్‌పై కపిల్ సిబల్ ఆగ్రహం
Updated Date - 2023-03-31T11:45:19+05:30 IST