ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Smriti Irani: పెళ్లిపై నెటిజన్‌ సూటి ప్రశ్న.. స్మృతి ఇరానీ ఘాటు సమాధానం

ABN, First Publish Date - 2023-08-14T21:11:23+05:30

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తాజాగా ఇన్‌స్ట్రాగ్రాంలో నిర్వహించిన ''ఆస్క్ మీ ఎనీథింగ్' కార్యక్రమంలో జుబిన్ ఇరానీతో వివాహం, ఇరానీ మాజీ భార్య మోనా గురించి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు అంతే సూటిగా, ఒకింత ఘాటుగా సమాధానం ఇచ్చారు.

న్యూఢిల్లీ: టీవీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి కేంద్ర మంత్రి అయిన స్మృతిఇరానీ (Smriti Irani) ఎప్పటికప్పడు తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. నిన్నకాక మొన్న లోక్‌సభలో రాహుల్ ''ఫ్లైయింగ్ కిస్'' సంకేతంపై నిప్పులు చెరిగిన స్మృతి ఇరానీ సామాజిక మాధ్యమాల్లోనూ చురకుగా ఉంటారు. తాజాగా ఇన్‌స్ట్రాగ్రాంలో నిర్వహించిన ''ఆస్క్ మీ ఎనీథింగ్' (Aak Me Anything) కార్యక్రమంలో జుబిన్ ఇరానీతో వివాహం, ఇరానీ మాజీ భార్య మోనా గురించి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు అంతే సూటిగా, ఒకింత ఘాటుగా స్మృతి ఇరానీ సమాధానం ఇచ్చారు.


''మీరు మీ స్నేహితురాలి (మోనా) భర్తను వివాహం చేసుకున్నారా?'' అని ఒక నెటిజన్ నేరుగా స్మృతి ఇరానీని ప్రశ్నించారు. దీనికి మంత్రి స్పందిస్తూ...''లేదు. మోనా నాకంటే వయసులో 13 ఏళ్ల పెద్దది. అందువల్ల ఆమె నాకు చిన్ననాటి స్నేహితురాలయ్యే అవకాశమే లేదు. ఆమె రాజకీయ నాయకురాలు కాదు. ఆమెను ఇందులోకి లాక్కండి. నాతో పోరాడండి, నాతో వాదించండి, నన్ను కించపరచండి, కానీ రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని ఆమెను ఇందులోకి లాక్కండి. ఆమెను గౌరవించండి'' అని అన్నారు.


జుబిన్ ఇరానీని 2001లో స్మృతి ఇరానీ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు జోర్, కుమార్తె జోయిష్ సంతానం. జుబిన్ అంతకుమందు మోనా ఇరానీని పెళ్లి చేసుకోగా, ఇద్దరికీ షానెల్లె అనే కుమార్తె ఉంది.

Updated Date - 2023-08-14T21:12:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising