ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sonia message to Karnataka: కర్ణాటక ప్రజలకు సోనియా వీడియో సందేశం

ABN, First Publish Date - 2023-05-20T21:25:09+05:30

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి చారిత్రక విజయం అధించిన కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ శనివారంనాడు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు సోనియాగాంధీ ఇచ్చిన వీడియో సందేశాన్ని కాంగ్రెస్ అధికార ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి చారిత్రక విజయం అధించిన కర్ణాటక (Karnataka) ప్రజలకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) శనివారంనాడు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు సోనియాగాంధీ ఇచ్చిన వీడియో సందేశాన్ని కాంగ్రెస్ అధికార ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేశారు.

''చారిత్రక తీర్పుతో కాంగ్రెస్‌కు ఘనవిజయం అందించిన కర్ణాటక ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, వాటి అమలుకు కట్టుబడి ఉంటుందని మీకు నేను మరోసారి భరోసా ఇస్తున్నారు. మేము ఇచ్చిన ఐదు హామీలను తొలి మంత్రివర్గ సమావేశంలోనే తక్షణం ఆమోదించడం చూసి గర్విస్తున్నాను. కర్ణాకట అభ్యుదయం, శాంతి, ప్రగతి కోసం కాంగ్రెస్ పార్టీ పునరంకితవుతోంది'' అని సోనియాగాంధీ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.

దీనికి ముందు, కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ శ్రీ కంఠీరవ స్టేడియంలో శనివారంనాడు ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వచ్ఛమైన, అవినీతి రహిత పాలన అందించనుందని రాహుల్ గాంధీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. తమ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు 5 ప్రధాన హామీలు ఇచ్చిందని, తాము ఎప్పుడూ తప్పుడు హామీలు ఇవ్వమని, ఏది చెప్పామో అదే చేస్తామని అన్నారు. మరో ఒకటి రెండు గంటల్లోనే క్యాబినెట్ తొలి సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలోనే ప్రజలకు ఇచ్చిన 5 హామీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్ ప్రకటించారు. ఇందుకు తగ్గట్టుగానే కొద్ది సేపటికే సిద్ధరామయ్య జరిపిన తొలి క్యాబినెట్ సమావేశంలో పార్టీ ఇచ్చిన 5 హామీలపై తొలి సంతకం చేస్తూ, తక్షణం అమలుకు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2023-05-20T21:25:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising