ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rahul Gandhi: మోదీజీ.. 70 శాతం మీ గొప్పలు చెప్పుకోండి, కనీసం 30 శాతమైనా కర్ణాటక గురించి మాట్లాడండి..!

ABN, First Publish Date - 2023-05-02T21:17:06+05:30

కర్ణాటకలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శివమొగ్గ: కర్ణాటకలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి విమర్శలు గుప్పించారు. ఇవేవీ ప్రధానమంత్రి ఎన్నికలు కావని, ఎంతసేపూ తన గురించి తాను చెప్పుకోవడం కాదని, కర్ణాటక అంశాలపై ఆయన (మోదీ) మాట్లాడిదే బాగుంటుందని అన్నారు. చిక్కమగళూరులో మంగళవారంనాడు జరిగిన రోడ్‌షోలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బహిరంగ సభల్లో తాము మల్లికార్జున్ ఖర్గే, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వంటి నేతలందరి గురించి మాట్లాడతామని, ప్రధాని మోదీ మాత్రం సొంత పార్టీలోని ఏ ఒక్క నేత గురించి మాట్లాడరని అన్నారు. కనీసం ముఖ్యమంత్రి బొమ్మై గురించైనా ఒక్క మాట కూడా మాట్లాడలేదని, ఎంతసేపూ తన గురించి తాను చెప్పుకుంటూ పోతుంటారని అన్నారు.

91 సార్లు ఆడిపోసుకోవడంపై...

కాంగ్రెస్ పార్టీ తనను 91 సార్లు ఆడిపోసుకుందని ప్రధాని చెబుతున్నారని, కానీ ఇవేమీ ప్రధానమంత్రి కోసం జరుగుతున్న ఎన్నికలు కావని రాహుల్ అన్నారు. రాష్ట్రంలోని యువకులు, మహిళలు, కార్మికులు, రైతులు కోసం జరుగుతున్న ఎన్నికలని, బీజేపీ కానీ, మోదీ కానీ ఈ అంశాలపై ఒక్క మాట కూడా మాట్లాడింది లేదని విమర్శించారు.

''మీ గురించి మాత్రమే మీరు (మోదీ) మాట్లాడతారని నాకు తెలుసు. మీరు ఒక పని చేయండి. 70 శాతం మీ గురించి మాట్లాడుకోండి. కనీసం 30 శాతమైనా కర్ణాటక గురించి, ద్రవ్యోల్బణం గురించి, గ్యాస్-పెట్రోల్ ధరల గురించి, రాష్ట్రానికి మీరు ఏమి చేయదలచుకున్నారనే విషయాల గురించి మాట్లాడండి'' అని రాహుల్ సూచించారు. ఈనెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, 13న ఫలితాలు ప్రకటిస్తారు.

Updated Date - 2023-05-02T21:17:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising