ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

New Parliament: రూ.75 నాణేన్ని ఆవిష్కరించిన మోదీ

ABN, First Publish Date - 2023-05-28T15:04:14+05:30

కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం సందర్భంగా రూ.75 నాణెంతో పాటు స్టాంపును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. దీనికి ముందు కొత్తగా నిర్మించిన పార్లమెంటుకు సంబంధించిన శిలాఫలకాన్ని ప్రధాని ఆవిష్కరించారు. కొత్త పార్లమెంటును జాతికి అంకితం చేశారు. లోక్‌సభలోకి ప్రవేశించగానే ఎంపీలు, పలు రాష్ట్రాల సీఎంలు, ఇతర ప్రజాప్రతినిధులు స్టాండింగ్ ఒవేషన్ పలికారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు (New parliament) ప్రారంభోత్సవం సందర్భంగా రూ.75 నాణెంతో పాటు స్టాంపును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. దీనికి ముందు కొత్తగా నిర్మించిన పార్లమెంటుకు సంబంధించిన శిలాఫలకాన్ని ప్రధాని ఆవిష్కరించారు. కొత్త పార్లమెంటును జాతికి అంకితం చేశారు. లోక్‌సభలోకి ప్రవేశించగానే ఎంపీలు, పలు రాష్ట్రాల సీఎంలు, ఇతర ప్రజాప్రతినిధులు స్టాండింగ్ ఒవేషన్ పలికారు. నిలబడి తమ చప్పట్ల మధ్య మోదీకి ఆహ్వానం పలికారు.

ప్రధాని తన ప్రసంగంలో ఈరోజు చరిత్రలో నిలిచిపోతుందని, 140 కోట్ల భారతీయుల కల సాకారమైందని, ఆధునిక భారతదేశానికి పార్లమెంటు అద్దం పడుతుందని అన్నారు. ఇది కేవలం భవనం మాత్రమే కాదని, 140 కోట్ల భారతీయుల ఆకాంక్షకు ప్రతీక అని అన్నారు. భారత్ అభివృద్ధి చెందడం అంటే ప్రపంచం కూడా అభివృద్ధి చెందడమేనని అన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, ఈ అమృత ఘడియల్లో భారతదేశ ప్రతిష్ట పెరిగిందని, మన బలమైన భవిష్యత్తుకు ప్రజాస్వామ్యమే పునాది అని అన్నారు. అంతర్గత, ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం మన పార్లమెంటుకు ఉందన్నారు. కొత్త పార్లమెంటులో కొత్త ఆలోచనలు, మంచి సూత్రాలతో ముందుకు వెళ్దామని అన్నారు. మోదీ సారథ్యంలో రెండున్నరేళ్లలో కొత్త పార్లమెంటు నిర్మించడం చాలా సంతోషకరమని, ఇది ఒక మైలురాయి అని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అన్నారు.

దేశ 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడానికి గుర్తుగా ప్రత్యేక 75 రూపాయల నాణేన్ని, తపాలా బిళ్లను మోదీ, ఓం బిర్లా, హరివంశ్ విడుదల చేశారు. ఈ నాణానికి ఒకవైపు అశోక స్తంభంలోని సింహ తలాటం, దానికి దిగువన ‘సత్యమేవ జయతే’ అక్షరాలు ఉంటాయి. ఎడమ వైపున దేవనాగరి లిపిలో ‘భారత్‌’ అని.. కుడివైపున ‘ఇండియా’ అని ఆంగ్లంలో రాసి ఉంటుంది. అలాగే దిగువన నాణెం విలువ అయిన 75 ముద్రించి ఉంటుంది. నాణానికి మరోవైపు పార్లమెంటు భవన సముదాయం ముద్రించి ఉంటుంది. దీనికి పైన.. సంసద్‌ సంకుల్‌ అని దేవనాగరి లిపిలో.. దిగువన పార్లమెంటు కాంప్లెక్స్‌.. అని ఆంగ్లంలో రాసి ఉంటుంది.

Updated Date - 2023-05-28T15:04:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising