Special train: 17 నుంచి ఊటీకి ప్రత్యేక రైలు
ABN, First Publish Date - 2023-09-12T07:40:03+05:30
మేట్టుపాళయం - ఊటీ(Mettupalayam - Ooty) మధ్య ఈనెల 17వ తేది నుంచి మళ్లీ ప్రత్యేక రైలు నడపనున్నారు. కోయంబత్తూర్
ఐసిఎఫ్(చెన్నై): మేట్టుపాళయం - ఊటీ(Mettupalayam - Ooty) మధ్య ఈనెల 17వ తేది నుంచి మళ్లీ ప్రత్యేక రైలు నడపనున్నారు. కోయంబత్తూర్ జిల్లా మేట్టుపాళయం నుంచి నీలగిరి(Neelagiris) జిల్లా ఊటీ మధ్య కొండ రైలులో ప్రయాణించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది వేసవి సీజన్‌లో ప్రతిశనివారం నడిపిన ఈప్రత్యేక రైలును ఆగస్టు 27వతేది నిలిపివేశారు. ఈనేపథ్యంలో, మళ్లీ ఈనెల 17 నుంచి అక్టోబరు 24వతేదివరకు నడపనున్నారు. శనివారం ఉదయం 9.10గంటలకు మేట్టుపాళయంలో బయల్దేరి మధ్యాహ్నం 2.20 గంటలకు ఊటీ చేరుకుంటుంది. ఆదివారం ఉదయం 11.25 గంటలకు ఊటీలో బయల్దేరి సాయంత్రం 4.20 గంటలకు మేట్టుపాళయం చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు రిజర్వేషన్ ప్రారంభమైంది.
Updated Date - 2023-09-12T07:40:05+05:30 IST