ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

G20 Meet: శ్రీనగర్‌లో జి 20 సదస్సు... మెరైన్ కమాండోలు, జాతీయ భద్రతా గార్డులతో భారీ భద్రత

ABN, First Publish Date - 2023-05-22T08:30:55+05:30

జమ్మూకశ్మీరులోని శ్రీనగర్ లో సోమవారం నుంచి జి20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మీట్‌ జరగనున్న నేపథ్యంలో సాయుధ భద్రతను కట్టుదిట్టం చేశారు...

Srinagar Security Tightened
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్ : జమ్మూకశ్మీరులోని శ్రీనగర్ లో సోమవారం నుంచి జి20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మీట్‌ జరగనున్న నేపథ్యంలో సాయుధ భద్రతను కట్టుదిట్టం చేశారు.జీ20 సభ్య దేశాల నుంచి 60 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. శ్రీనగర్ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో ప్రతినిధులు సింగపూర్ నుంచి వస్తున్నారని అధికారులు చెప్పారు.2019వ సంవత్సరం ఆగస్టులో కేంద్రం జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసి, రాష్ట్ర హోదాను తొలగించిన తర్వాత ఈ ప్రాంతంలో అంతర్జాతీయ కార్యక్రమం జరగడం ఇదే తొలిసారి.

శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాలు, జి20 సమావేశానికి వేదిక అయిన షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కి వెళ్లే రహదారుల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు.కాశ్మీర్‌లో జి20 సమావేశాన్ని నిర్వహించడాన్ని చైనా వ్యతిరేకించింది. సౌదీ అరేబియా ఈవెంట్ కోసం పేరు నమోదు చేసుకోలేదు. శ్రీనగర్ సమావేశానికి దూరంగా ఉండాలని టర్కీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

వివాదాస్పద ప్రాంతాల్లో జీ20 సమావేశాలు నిర్వహించడాన్ని చైనా గట్టిగా వ్యతిరేకిస్తోందని, అలాంటి సమావేశాలకు హాజరుకారాదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ చెప్పారు.సమావేశానికి ముందు శ్రీనగర్‌లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మెరైన్ కమాండోలు, జాతీయ భద్రతా గార్డులను మోహరించారు.గగనతల భద్రతలో భాగంగా యాంటీ-డ్రోన్ యూనిట్లను ఏర్పాటు చేశారు.

ఉగ్రవాదులు జి20 ఈవెంట్‌కు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నించవచ్చన్న నివేదికల మధ్య ఆర్మీ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్), సశాస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బి),జమ్మూ కాశ్మీర్ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.జి20 ప్రతినిధులు ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ కదలికపై కూడా ఆంక్షలు విధించారు.లాల్ చౌక్ ఏరియాలోని దుకాణాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దుకాణాలు తెరిచి ఉంచేందుకు ప్రత్యేక పాస్‌లు జారీ చేశారు.జి-20 దేశాల పర్యాటక కార్యవర్గ సమావేశం విజయవంతం కావడం వల్ల జమ్మూ కాశ్మీర్‌లో పర్యాటకుల రాక, పెట్టుబడులు పెరుగుతాయని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు.

Updated Date - 2023-05-22T08:57:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising