ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chennai: రక్తపు వాంతి చేసుకుని చనిపోయిన మెరైన్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి

ABN, First Publish Date - 2023-08-18T15:21:05+05:30

రక్తపు వాంతితో విద్యార్థి చనిపోయిన విషాద ఘటన చెన్నై లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని ప్రైవేటు మెరైన్ ఇంజనీరింగ్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ప్రశాంత్ (22) మరణంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రశాంత్‌ను ఆసుపత్రికి తరలించే లోపే అతను ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు.

చెన్నై: రక్తపు వాంతి (Vomiting blood)తో విద్యార్థి చనిపోయిన విషాద ఘటన చెన్నై (Chennai)లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని ప్రైవేటు మెరైన్ ఇంజనీరింగ్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ప్రశాంత్ (22) మరణంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రశాంత్‌ను ఆసుపత్రికి తరలించే లోపే అతను ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు.


కాలేజీ ఆవరణలో సమావేశమైన విద్యార్థులు రాత్రి 11 గంటల ప్రాంతంలో ధర్నా చేపట్టారు. ప్రశాంత్ మరణానికి కారణమైన వారిపై కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలంటూ రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం తలెత్తింది. కనతూరు పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని తగిన విచారణ జరుపుతామని విద్యార్థులకు నచ్చజెప్పడంతో పరిస్థితి అదుపులోనికి వచ్చింది.


కాగా, ప్రశాంత్ మరణానికి ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) కారణమని విద్యార్థులు ఆరోపించారు. ప్రశాంత్ ఆరోగ్యం బాగోలేదని తెలిసి కూడా పరేడ్‌లో పాల్గొనాలని ఒత్తిడి తేవడంతో అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని వారు తెలిపారు. విద్యార్థుల ఆందోళనతో మాజీ సైనికుడైన ఫిజికల్ డైరెక్టర్ పురుషోత్తంను కాలేజీ యాజమాన్యం డిస్మిస్ చేసింది. కాలేజీ చేపట్టే ఇంటర్నెల్ ఎంక్వయిరీకి హాజరుకావాలని కూడా ఆయనను ఆదేశించింది. విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్ని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-08-18T15:29:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising