ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Suburban trains: 94 సబర్బన్‌ రైళ్ల రద్దు.. కారణం ఏంటంటే...

ABN, First Publish Date - 2023-11-19T09:08:40+05:30

పలు రకాలైన మరమ్మతు పనుల కారణంగా 94 సబర్బన్‌ రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ రైల్వే(Southern Railway) పేర్కొంది.

అడయార్‌(చెన్నై): పలు రకాలైన మరమ్మతు పనుల కారణంగా 94 సబర్బన్‌ రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ రైల్వే(Southern Railway) పేర్కొంది. చెన్నై సెంట్రల్‌ - అరక్కోణం మార్గంలో పట్టాభిరాం - అంబత్తూరు డిపో వరకు ఈ మరమ్మతులు ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు జరగనున్నాయి. ఈ కారణంగా ఏకంగా 94 రైళ్లను రద్దు చేశారు. ఆదివారం ఉదయం సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ వేకువ జామున 4 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు నడిపే 84 రైళ్లను రద్దు చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా చెన్నై బీచ్‌ నుంచి ఉదయం 9.10 గంటలకు ప్రత్యేక రైలును నడుపనున్నారు. అలాగే, అరక్కోణం - తిరుత్తణి ప్రాంతాల మధ్య ఉదయం 6 గంటలకు, తిరువళ్లూర్‌ - పొన్నేరి(Tiruvallur - Ponneri) మధ్య ఉదయం 5.20 గంటలకు, అరక్కోణం - చెన్నై బీచ్‌ ప్రాంతాల మధ్య ఉదయం 6.20 గంటలకు ప్రత్యేక రైళ్లను నడుపున్నారు. ఈ రైళ్లన్నీ పుట్లూరు, చెవ్వాయ్‌పేట, వేపంపట్టు, తిరునిండ్రయూర్‌, నెమిలిచ్చేరి, పట్టాభిరాం, హిందూ కాలేజీ, అన్ననూర్‌, తిరుముల్లైవాయల్‌, అంబత్తూరు, పట్రవాక్కం, కొరట్టూరు స్టేషన్లలో ఆగవని దక్షిణ రైల్వే విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.

Updated Date - 2023-11-19T09:08:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising